Advertisementt

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఆడియో వేడుక!

Mon 11th Jan 2016 05:28 PM
seethamma andalu ramayya sithraalu audio launch,raj tarun,srinivas gavireddy  సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఆడియో వేడుక!
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఆడియో వేడుక!
Advertisement
Ads by CJ

రాజ్ తరుణ్, అర్తన జంటగా శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఎన్.శంకర్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

ఎన్.శంకర్ మాట్లాడుతూ.. ''తక్కువ సమయంలో సంగీత దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్న గోపిసుందర్ ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. శ్రీనివాస్ గవిరెడ్డి చేసే పాత్రల్లో వెటకారం ఎక్కువ.. తనలో కారం ఎక్కువ. రాజ్ తరుణ్ లో మమకారం ఎక్కువ. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ లో సంస్కారం ఎక్కువ. ఈ కార్యక్రమంలో నేను భాగం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. లవ్ స్టొరీ కి, కామెడీ ను జోడించి ఈ సినిమా చేశారు. ఈ నెలాఖరున విడుదలవుతున్న సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

ఎస్.శైలేంద్రబాబు మాట్లాడుతూ.. ''కన్నడలో సినిమాలు చేశాను. తెలుగులో కూడా సినిమా చేయాలని ప్లాన్ చేసుకొని ఈ సినిమా చేశాం. శ్రీనివాస్ ను కలిసి కథ విన్నాను. ఆయన ఏం చెప్పారో.. అదే తీశారు. గోపిసుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నాను'' అని చెప్పారు.

గోపిసుందర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైంది. అందరూ ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా. మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ.. ''గోపిసుందర్ గారి మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి గొప్ప వ్యక్తి మా సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా ఉంది. శైలేంద్ర గారు కన్నడలో ఎన్నో సినిమాలు చేశారు. నేను చెప్పిన కథ నచ్చి నన్ను నమ్మి నాతో ఈ సినిమా చేశారు. నాకు మంచి లైఫ్ ఇచ్చారు. అవుట్ పుట్ బాగా వచ్చింది. అందరు కష్టపడి పని చేశారు. సీత కోసం ఈ రాముడు ఏం చేసాడనేదే ఈ సినిమా. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ''గోపి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. విశ్వ ప్రతి ఫ్రేం ను అందంగా చూపించారు. సినిమాలో అంత బాగా నటించానంటే దానికి కారణం శ్రీనివాస్. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా. మంచి లవ్ స్టొరీ, కామెడీ ఉంటుంది'' అని చెప్పారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ''మంచి టైటిల్ సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు . నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మంచి టాలెంట్ ఉన్న పెర్సన్. ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. ఈ సినిమాతో శ్రీను పెద్ద డైరెక్టర్ అవ్వాలి. గోపిసుందర్ మంచి బాణీలను సమకూర్చారు. రాజ్ తరుణ్ వరుస హిట్స్ తో ఉన్నాడు. ఈ సినిమా కూడా తన హిట్ ఖాతాలో చేరాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

మదన్ మాట్లాడుతూ.. ''సినిమా టీజర్, సాంగ్స్ బావున్నాయి. నా తమ్ముడికి డైరెక్టర్ అవకాసం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

ఆది మాట్లాడుతూ.. ''సంవత్సరంన్నర గా శ్రీను నాకు తెలుసు. నేను నటిస్తున్న గరం సినిమాకు మాటలు అందించారు. నా సొంత బ్రదర్ లాంటి వాడు. రాజ్ తరుణ్, శ్రీను, నేను మంచి క్లోజ్ ఫ్రెండ్స్. శ్రీను సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. ప్యాషనేట్ డైరెక్టర్. గోపిసుందర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీను సినిమాకు మ్యూజిక్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి శ్రీనుకి మంచి బ్రేక్ రావాలి'' అని చెప్పారు.

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''రాజ్ తరుణ్ నాకు మంచి స్నేహితుడు. హ్యాట్రిక్ హిట్స్ తరువాత తను నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో తనకు మరో హ్యాట్రిక్ మొదలవ్వాలి'' అని చెప్పారు.

పల్నాటి సూర్యప్రతాప్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా నా సొంత సినిమా లాంటిది. రాజ్ తరుణ్, శ్రీను నాకు మంచి ఫ్రెండ్స్. గోపిసుందర్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. కుమారి 21 ఎఫ్ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. రాజ్ తరుణ్ సెలెక్టివ్ సబ్జెక్ట్స్ ఎన్నుకుంటున్నాడు. శ్రీను మంచి టైమింగ్ ఉన్న డైరెక్టర్. నిర్మాతలకు, హీరోయిన్ కు మిగిలిన టీంకు ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''నాకు కావాల్సిన వాళ్ళు, నా మిత్రులు కలిసి చేసిన సినిమా ఇది. నిర్మాతలకు తెలుగులో మొదటి సినిమా. రాజ్ తరుణ్ ను 'ఉయ్యాల జంపాల' సినిమా నుండి చూస్తున్నాను. న్యాచురల్ గా నటిస్తాడు. సక్సెస్ ఫుల్ హీరోగా నిలవాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ ఈ సినిమాతో మంచి దర్శకుడు కావాలి. గోపిసుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అర్తన, విశ్వ, థామస్ రెడ్డి, మల్కాపురం శివకుమార్, డి.ఎస్.రావు, హేమ తదితరులు పాల్గొన్నారు. 

తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ఆర్ట్: జేవీ, అడిషనల్ డైలాగ్స్: అనీల్ మల్లెల, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు, కథ-స్కీన్ ప్లే--దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ