Advertisementt

'చోరి' మోషన్ పోస్టర్ లాంచ్!

Tue 12th Jan 2016 03:41 PM
chori movie motion poster launch,preetham,prabhas nimmala  'చోరి' మోషన్ పోస్టర్ లాంచ్!
'చోరి' మోషన్ పోస్టర్ లాంచ్!
Advertisement
Ads by CJ

ప్రీతమ్‌, మధులగ్నదాస్‌, దీపాళి ప్రధాన పాత్రలుగా మై టీం వర్క్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రభాస్‌ నిమ్మల దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'చోరి'. అల్లాడి శకుంతల, కనాల నారపరెడ్డి నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పోస్టర్‌ను రాజ్‌ కందుకూరి, మోషన్‌ పోస్టర్‌ను తుమ్మలపల్లి సత్యనారాయణ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా... 

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''కొత్త దర్శకుడు, కొత్త హీరో కలిసి ఈ సినిమా చేస్తున్నారు. సినిమా సమయానికి పూర్తి చేసి పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ.. ''సినిమా టైటిల్ క్యాచీగా ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలకు ముడిపడిన సమస్యను చిత్రంగా రూపొందిస్తున్నారు. మంచి టీం కుదిరింది. టీం అందరికి ఆల్‌ ది బెస్ట్‌'' అని అన్నారు.  

దర్శకుడు ప్రభాస్‌ నిమ్మల మాట్లాడుతూ.. ''దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాను డైరెక్ట్‌ చేయడమే కాకుండా సంగీతం కూడా అందించాను. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్ లో ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న ఒక సమస్యను ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేస్తున్నాను. సైంటిస్ట్ అయిన హీరోకు ఒక స్నేహితుడు ఉంటాడు. అతని వలన ప్రజలు ఇబ్బందులు పడతారు. ఆ సమస్యలను హీరో ఎలా ఎదుర్కొన్నాడనేదే సినిమా. రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. 70 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన షూటింగ్ ను జనవరిలో పూర్తి చేసి  సినిమాను ఫిబ్రవరిలో కానీ, మార్చిలో కానీ విడుదల చేయాలనుకుంటున్నాం'' అని అన్నారు. 

కె.కోటిరెడ్డి, ప్రశాంత్‌, భరత్‌, సుధాకర్‌ నిమ్మల, అజయ్‌ ఘోష్‌ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల, సంగీతం: ప్రభాస్‌, పాటలు: భాస్కర్‌, రామ్‌ దాస్‌, ఎం.వి.కె, మాటలు: ప్రశాంత్‌, నిర్మాతలు: అల్లాడి శకుంతల, కనాల నారపరెడ్డి, కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ప్రభాస్‌ నిమ్మల. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ