వినయ్ రాయ్, స్వాస్తిక, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో సరన్ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం 'కింగ్స్'. ఈ చిత్రం టైటిల్ లోగోను బుధవారం హైదరబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..
దర్శకుడు సరన్ మాట్లాడుతూ.. ''సూర్యగ్రహణం రోజు పుట్టిన ఇద్దరు కవల పిల్లలు బద్ద శత్రువులుగా ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. ఇదొక మంచి ఫాంటసీ ఎంటర్టైనర్ స్టొరీ. సినిమా నిర్మాణంలో ఖర్చుకు వెనుకాడకుండా సింగపూర్, బ్యాంకాక్ ప్రాంతాల్లో ఆర్.కె.గౌడ్ గారు షూటింగ్ చేస్తున్నారు'' అని చెప్పారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''ఇప్పటివరకు సింగపూర్, బ్యాంకాక్ లలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం. జనవరి 23 నుండి హైదరాబాద్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. జెమిని సినిమా తరువాత తెలుగులో పెద్ద హిట్ కొట్టాలని డైరెక్టర్ సరన్ ఎంతో కసిగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వినయ్ రాయ్, సాక్షి చౌదరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. రెండు భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
వినయ్ రాయ్ మాట్లాడుతూ.. ''తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించే విధానం మరెక్కడా చూడలేదు. సరన్ మంచి సబ్జెక్టు తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో స్వాస్తిక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రమణి భరద్వాజ్, కెమెరా: కృష్ణ రమణ, ఎడిటింగ్: శ్రీను, డిజైనర్: భాస్కర్ గౌడ్, నిర్మాత: రామకృష్ణ గౌడ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సరన్.