Advertisementt

పవర్‌స్టార్‌ ఆడియో ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ ఛీఫ్‌ గెస్ట్‌!

Sat 23rd Jan 2016 04:15 PM
hero punith rajkumar,punith rajkumar latest movie chakra vyuha,ntr chief guest to chakra vyuha audio function,ntr and kajal sung a song for chakravyuha,chakravyuha audio function on feb 12th  పవర్‌స్టార్‌ ఆడియో ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ ఛీఫ్‌ గెస్ట్‌!
పవర్‌స్టార్‌ ఆడియో ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ ఛీఫ్‌ గెస్ట్‌!
Advertisement
Ads by CJ

ఈమధ్య కాలంలో హీరోల ఆడియో ఫంక్షన్స్‌కి మిగతా హీరోలు కూడా రావడం, ఆడియోను రిలీజ్‌ చెయ్యడం మనం చూస్తున్నాం. ఈ విషయంలో టాలీవుడ్‌ హీరోలంతా ఒకరినొకరు సపోర్ట్‌ చేసుకుంటున్నారు. ఆయా హీరోల సినిమాల ఆడియోలు, సినిమాలు పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్‌ మరి కాస్త ముందుకెళ్ళి పక్క రాష్ట్రంలోని హీరోకి సపోర్ట్‌ చెయ్యబోతున్నాడు. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా వస్తున్న కొత్త చిత్రం చక్రవ్యూహ ఆడియో ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ ఛీఫ్‌ గెస్ట్‌గా అటెండ్‌ అవ్వబోతున్నాడు. 

ఫిబ్రవరి 12న ఈ చిత్రం ఆడియో బెంగుళూరులో ఘనంగా జరగబోతోంది. ఈ చిత్రంలోని ఒక స్పెషల్‌ సాంగ్‌ని ఎన్టీఆర్‌, కాజల కలిసి పాడిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఈ పాట పెద్ద హైలైట్‌ అవుతుందని చక్రవ్యూహ యూనిట్‌ చెబుతోంది. బాద్‌షా చిత్రం కోసం తెలుగులో శింబుతో పాట పాడించిన థమన్‌ ఇప్పుడు చక్రవ్యూహ కోసం ఎన్టీఆర్‌తో పాట పాడించాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ