Advertisementt

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'మౌనం'!

Sat 23rd Jan 2016 05:26 PM
mounam press meet,kishan sagar,murali krishna,bhanu sri  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'మౌనం'!
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'మౌనం'!
Advertisement
Ads by CJ

మురళి కృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో లాస్ ఏంజిల్స్ టాకీస్ పతాకంపై సంధ్యా మోషన్ పిక్చర్స్ సమర్పణలో కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్య ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'మౌనం'. ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్రబృందం శనివారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా..

దర్శకుడు కిషన్ సాగర్ మాట్లాడుతూ.. ''డి.ఓ.పి గా చేసే నాకు ఈ చిత్రం ద్వారా దర్శకత్వం వహించే అవకాశం ఇస్తున్న నిర్మాతకు థాంక్స్. 'మౌనం' అనే టైటిల్ ఈ చిత్రానికి యాప్ట్ అనిపించింది. సైలెన్స్ అనేదానికి హారర్ మూవీలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇదొక డిఫరెంట్ హారర్ మూవీ. స్పిరిట్ కు ఘోస్ట్ కు ఉన్న తేడాను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ప్రసుత్తం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. సైంటిఫిక్‌ రీజన్‌తో కనపడే సినిమా'' అని చెప్పారు.

కనకాల సుబ్బారావు(రవి) మాట్లాడుతూ.. ''గతంలో సంపత్‌నందిగారితో కలిసి 'గాలిపటం' మూవీ చేశాం. పత్రి సంవత్సరం మా బ్యానర్‌ నుండి ఓ సినిమా వచ్చేలా ప్లాన్‌ చేసుకుంటున్నాం. అనుకున్న బడ్జెట్‌ కంటే పది శాతం తక్కువలోనే సినిమాను పూర్తి చేశాం'' అని అన్నారు.

ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ.. ''ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, రీరికార్డింగ్ వర్క్ జరుగుతోంది. హారర్ సినిమాకు రీరికార్డింగ్ చాలా ముఖ్యం. సినిమా చాలా బాగా వచ్చింది'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మురళీ కృష్ణ, శివ, భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బలుసు రామారావు, కథ: అనిల్ కె నాని, కథనం-మాటలు-కూర్పు: శివ శర్వాణి, దర్శకత్వం-డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కిషన్ సాగర్.ఎస్, నిర్మాత: అల్లూరి సూర్యప్రసాద్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ