తెలుగు ప్రేక్షకులకు కామెడీ బాగా తెలుసు.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అదే కదా! యాక్షన్, హారర్, లవ్.. ప్రతి కథలోనూ కామెడీ కంపల్సరీ అయ్యింది. గతంలో సెంటిమెంట్ సినిమాల హవా నడిచింది గనుక, మనోళ్ళకు ట్రాజెడీ కూడా బాగా తెలుసండోయ్! మరి. జోమెడీ(zomedy) మూవీస్ అంటే? త్వరలో చూపిస్తామంటున్నారు నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్. శ్రీ అత్చ్యుత ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మిస్తున్న చిత్రం 'తను.. వచ్చేనంట'. తేజ కాకుమాను, రష్మి గౌతమ్, ధన్య బాలకృష్ణ హీరో హీరోయిన్లు. వెంకట్ కాచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈరోజు నుంచి రెండవ షెడ్యూల్ మొదలైంది.
చిత్ర నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ.. ''తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రంతో సరికొత్త జోనర్ పరిచయం చేస్తున్నాం. కథ, కథనం.. అన్నీ కొత్తగా ఉంటాయి. రష్మి గౌతమ్ నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చంటి, ఫిష్ వెంకట్, శివన్నారాయణల కామెడీ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ఈరోజు నుంచి మొదలైన రెండవ షెడ్యూల్ షూటింగులో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో షూటింగ్ బాగా జరుగుతోంది'' అన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్ : బెక్కం రవీందర్, లైన్ ప్రొడ్యూసర్ : లావు శ్రీమన్నారాయణ, ఎడిటర్ : నందమూరి హరి, ఆర్ట్ డైరెక్టర్ : సిస్తల శర్మ, ఛాయాగ్రహణం : రాజ్ కుమార్, సాహిత్యం : వశిష్ఠ శర్మ, సంగీతం : రవిచంద్ర, సహ నిర్మాత : పి.యశ్వంత్, కథ - నిర్మాత : చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : వెంకట్ కాచర్ల.