సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న సూపర్‌స్టార్ మహేష్ 'శ్రీమంతుడు'
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మించిన హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'శ్రీమంతుడు'. ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా 100 కోట్ల షేర్ సాధించి సూపర్‌స్టార్ మహేష్ చిత్రాల్లో రికార్డ్ సృష్టించింది. 15 సెంటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపటి(28 జనవరి)తో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోబోతోంది. ఎమ్మిగనూరు - లక్ష్మణ్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు పూర్తి చేసుకోబోతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) మాట్లాడుతూ - మా బేనర్‌లో నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రం రేపటికి 175 రోజులు పూర్తి చేసుకోబోతోంది. మా మొదటి ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం ఇంత భారీ విజయాన్ని సాధించడం ఎంతో ఆనందంగా వుంది. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా రూపొందించి మా బేనర్‌కు ఘనవిజయాన్ని చేకూర్చారు. మా తొలిసినిమాని సూపర్‌స్టార్ మహేష్‌తో నిర్మించడం, అది సిల్వర్ జూబ్లీ చిత్రం కావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి 6 'ఐఫా' అవార్డులు రావడం చాలా హ్యాపీగా వుంది.. అన్నారు.
'శ్రీమంతుడు' చిత్రానికి అవార్డుల పంట
సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన 'శ్రీమంతుడు' చిత్రం 6 'ఐఫా' అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడుగా సూపర్‌స్టార్ మహేష్, ఉత్తమనటిగా శృతిహాసన్, ఉత్తమ సహాయనటుడిగా జగపతిబాబు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్, ఉత్తమ గేయరచయితగా రామజోగయ్యశాస్త్రి(రామ.. రామ), ఉత్తమ నేపథ్యగాయకుడిగా సాగర్(జతకలిసే..) 'ఐఫా' అవార్డులు అందుకున్నారు.