శుభకారి క్రియేషన్స్ పతాకంపై తుమ్మల నవ్య మరియు నిత్య సమర్పిస్తున్న సినిమా 'నిన్నే కోరుకుంటా'. దర్శకుడు గణమురళి శరగడం. నిర్మాత మరిపి విద్యాసాగర్. విజయ భాస్కర్, వివేక్, ఆనంద్, పూజిత, వైజాగ్ ప్రసాద్, పూర్ణిమ, సారిక, ప్రదీప్, సత్యం రాజేష్, సుమన్ శెట్టి, కొండవలస, సంజన, అంబటి శ్రీను, ప్రసాద్ చౌదరి ప్రధాన తారాగణం. ప్రణవ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరరాబాద్ లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. తూరుపు జగ్గారెడ్డి బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి తొలి సీడీని మల్కాపురం శివకుమార్, దేవీప్రసాద్ లకు అందజేశారు.
తూరుపు జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ''సినిమాలో పాటలు చాలా బావున్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలి. దర్శక, నిర్మాతలకు, టెక్నిషియన్స్‌కు మంచి పేరును తీసుకురావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ''ప్రణవ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా టైటిల్ బావుంది. పెద్ద సక్సెస్ ను సాధించి మరికొన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను'' అని అన్నారు.
విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ''ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయికి మధ్య నడిచే రొమాంటిక్ ఎంటర్‌టైనర్. మంచి మెసేజ్ కూడా ఉంటుంది'' అని అన్నారు.
నిర్మాత మరిపి విద్యాసాగర్(వినయ్) మాట్లాడుతూ.. ''సపోర్ట్ చేసిన నటీనటుకు, టెక్నిషియన్స్‌కు థాంక్స్. మంచి మ్యూజిక్ కుదిరింది. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పూజిత, చంద్రమహేష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దేవిప్రసాద్, లయన్ సాయివెంకట్, రాము, నాగుగవర, వైజాగ్ ప్రసాద్, సంధ్యాజనక్ పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు.
ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, ఎడిటింగ్: నందమూరి హరి, పాటలు: పోతుల రవికిరణ్, కులశేఖర్, మాటలు: సాహు, ప్రకాష్, మాధవ్ ఆర్ట్: నాగు, డ్యాన్స్: పాల్, లుక్స్‌రాజా, శేఖర్, నిర్మాత: మరిపి విద్యాసాగర్(వినయ్), దర్శకత్వం: గణ మురళి శరగడం.