Advertisementt

'యువతేజం' టీజర్ లాంచ్!

Sat 06th Feb 2016 05:18 PM
yuvatejam teaser launch,s.srinivasulu,shipa,meghana  'యువతేజం' టీజర్ లాంచ్!
'యువతేజం' టీజర్ లాంచ్!
Advertisement
Ads by CJ

ఎస్.శ్రీనివాసులు, శిల్ప, మేఘన ప్రధాన పాత్రల్లో శ్రీ వెంకటసాయి ఫిలిమ్స్ సమర్పణలో ఎస్.శ్రీనివాసులు దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న సినిమా 'యువతేజం'. ఈ చిత్రం టీజర్ లాంచ్ శనివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

ఎస్.శ్రీనివాసులు మాట్లాడుతూ.. ''దర్శకుడు వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయం చేశారు. సినిమాలో శిల్ప, మేఘన చక్కగా నటించారు. మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీజీ గారి ప్రతిభను చూపించే విధంగా సినిమా ఉంటుంది. అవుట్ పుట్ బాగా వచ్చింది. యాక్షన్ తో పాటు సినిమాలో మథర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే రీతిలో సినిమాను రూపొందించాం'' అని చెప్పారు.

రాంబాబు మాట్లాడుతూ.. ''హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా అన్ని తానై శ్రీనివాసులు ఈ  సినిమాను తెరకెక్కించాడు. సినిమా మీద ఉన్న మోజుతో ఈ సినిమాను రూపొందించారు. ఇదొక మంచి సందేశాత్మక చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. గాంధీని మరచిపోతున్న ఈరోజుల్లో ఆయనను గుర్తు చేసే విధంగా సినిమా ఉంటుంది'' అని చెప్పారు.

ఏ.ఆర్.సన్నీ మాట్లాడుతూ.. ''శ్రీనివాసులు ఎంతో తపన ఉన్న వ్యక్తి. సినిమాలో మొత్తం ఆరు పాటలుంటాయి. విజువల్ గా కూడా సినిమా బావుంటుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.సన్నీ, ఫోటోగ్రఫీ: డి.యాదగిరి, పాటలు: కృష్ణారావు, ఎడిటర్: సర్ధాజ్, నిర్మాత-దర్శకత్వం: ఎస్.శ్రీనివాసులు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ