Advertisementt

రెడీ ఫర్ రిలీజ్: 'లండన్ లైఫ్'

Wed 10th Feb 2016 04:22 PM
london life movie,neveen medaram,abhishek pictures  రెడీ ఫర్ రిలీజ్: 'లండన్ లైఫ్'
రెడీ ఫర్ రిలీజ్: 'లండన్ లైఫ్'
Advertisement
Ads by CJ

అసద్ షాన్, యాంబర్ రోజ్ ప్రధాన పాత్రల్లో నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందించిన సినిమా 'లండన్ లైఫ్'. లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

దర్శకుడు నవీన్ మేడారం మాట్లాడుతూ.. ''హాలీవుడ్ లో సుమారుగా ముప్పై సినిమాలకు పని చేశాను. ఆ అనుభవంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాను. ఇండియా నుండి లండన్ వెళ్ళిన తొమ్మిది మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో వాళ్ళకు ఎదురైన సంఘటనలను సినిమాగా రూపొందించాం. పూర్తిగా లండన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అభిషేక్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న హైదరాబాద్ లో రిలీజ్ చేస్తున్నాం. లండన్, అమెరికాలలో కె.వి పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఐ.టి ఉద్యోగులు, ఫారెన్ లో చదువుకునే స్టూడెంట్స్ ను టార్గెట్ చేసి ఈ సినిమా చేశాం. సిద్ధార్థ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి రొమాంటిక్ కామెడీ ఫిలిం ఇది'' అని చెప్పారు.

కాళి సుదీర్ మాట్లాడుతూ.. ''టాలెంట్ ఉండి మంచి దారి తెలియక చాలా మంది ఉన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి అంగీకరించాం. నవీన్ మేకింగ్ చాలా బావుంది. సినిమాలో మంచి ఎమోషనల్ లవ్ స్టొరీ ఉంది'' అని చెప్పారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''నవీన్ నాకు మంచి స్నేహితుడు. తను డైరెక్ట్ చేసిన లండన్ లైఫ్ సినిమా చూశాను. ఇదొక ఎమోషనల్ డ్రామా. హైదరాబాద్ లోని 33 మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమా రిలీజ్ అవుతోంది. ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా కథ తెలిసినప్పుడు కథకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. సాంగ్స్, సినిమా బాగా వచ్చింది'' అని చెప్పారు

ఈ చిత్రానికి దర్శకుడు: నవీన్ మేడారం, ప్రొడ్యూసర్: రేణు పటేల్, ఫోటోగ్రఫీ: ఆంతోనీ గుర్నెర్, ఎడిటర్: రోబర్టో ప్రెస్టియా, మ్యూజిక్: సిద్ధార్థ్ సదాశివుని, స్క్రీన్ ప్లే: భైరవి పటేల్, నేవీన్ మేడారం, డిస్ట్రి బ్యూటర్: అభిషేక్ పిక్చర్స్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ