టాలీవుడ్ టాప్ రైటర్స్‌లో వక్కంతం వంశీ ఒకరు. 'కిక్, ఎవడు, రేసుగుర్రం, టెంపర్' వంటి సూపర్‌హిట్ చిత్రాలకు పనిచేసిన ఆయన 'అశోక్, అతిథి, కళ్యాణ్‌రామ్ కత్తి' వంటి ఫ్లాప్ చిత్రాలకు సైతం పనిచేశాడు. కాగా నేడు రచయితలు దర్శకులు కావాలని ఆశపడటం మామూలైపోయింది. కొందరు ఆ దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు... అవుతున్నారు. మరికొందరు అదే ప్రయత్నాలలో ఉన్నారు. వక్కంతం కూడా చాలాకాలంగా దర్శకునిగా మారాలని ఆశపడుతున్నాడు. తనకు చాలా క్లోజ్ అయిన ఎన్టీఆర్ తన సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ ఇస్తానని మాట ఇవ్వడంతో ఆయన ఎప్పటినుండో ఎన్టీఆర్‌తోనే మొదటి చిత్రం చేసి డైరెక్టర్‌గా తన జర్నీ ప్రారంభించాలని ఆశలు పెట్టుకున్నాడు. వాస్తవానికి మొదట 'టెంపర్' చిత్రాన్ని తానే దర్శకత్వం వహించాలని వంశీ ఆశపడ్డాడు. కానీ ఎన్టీఆర్ హామీతో ఆయన మాటకాదనలేక పూరీకి ఆ స్టోరీని ఇచ్చాడు. కొరటాల శివ చిత్రం తర్వాత అయినా ఎన్టీఆర్ తనకు అవకాశం ఇస్తాడని ఆశపడ్డాదు. అది కూడా జరిగే పని కాకపోవడంతో ఎన్టీఆర్‌కు బై చెప్పి మరో హీరోను చూసుకొనే పనిలో పడ్డాడు. ఇలా ఎన్టీఆర్ నమ్మకద్రోహం చేశాడని బాధపడుతున్న వక్కంతం వంశీ విక్టరీ వెంకటేష్‌కి ఓ కథ వినిపించి మొదటి సినిమాను వెంకీతో చేయడానికి సిద్దమవుతున్నాడు. ఎన్టీఆర్‌తోనే మొదటి సినిమా చేయాలనే ఆశను ఆయన పూర్తిగా వదులుకున్నాడని టాక్.