Advertisementt

'యమపాశం' పాటలు విడుదల!

Sat 13th Feb 2016 03:58 PM
yamapasham audio release,nani,jayam ravi,shakthi sounder rajan  'యమపాశం' పాటలు విడుదల!
'యమపాశం' పాటలు విడుదల!
Advertisement
Ads by CJ

జయం రవి, లక్ష్మీ మీనన్ జంటగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో సినీకార్న్ బ్యానర్ పై ముకేష్ ఆర్ మెహతా నిర్మించిన తమిళ చిత్రం 'మిరుథన్' ను 'యమపాశం' అనే పేరుతో నిర్మాత బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నాని థియేట్రికల్ ట్రైలర్ తో పాటు బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

నాని మాట్లాడుతూ.. ''ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఓ హాలీవుడ్ మూవీ ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఇప్పటివరకు హాలీవుడ్ లో తప్ప ఎక్కడ చేయని జోంబీ జోనర్ లో సినిమా తీశారు. జయం రవి తమిళంలో పెద్ద పెద్ద కమర్షియల్ ఫిల్మ్స్ లో నటిస్తున్నాడు. అలాంటిది తనొక డిఫరెంట్ జోనర్ లో ఉన్న సినిమాను సెలెక్ట్ చేసుకోవడం గొప్ప విషయం. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలను సమర్పించిన మోహన్ గారి కుమారుడు రవి. తెలుగు వాడైనా తమిళంలో సినిమాలు చేస్తూ.. అక్కడ రాణిస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్ గా తను నటించిన 'తని ఒరువన్' సినిమా సుమారుగా అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా తనకు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

జయం రవి మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న నాని మా సినిమా ఫంక్షన్ కు రావడం సంతోషంగా ఉంది. తన హార్డ్ వర్కే సక్సెస్ కు కారణం.  ఇక ఈ సినిమా విషయానికొస్తే ఇప్పటివరకు హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ సినిమాలు వచ్చాయి. అలా కాకుండా ఓ గ్లోబల్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలనుకున్నాం. నేచర్ వర్సెస్ హ్యూమన్ కాన్సెప్ట్ తీసుకొని సినిమా చేశాం. మనం ఎన్నో రకాలుగా నేచర్ ను ఇబ్బంది పెడుతున్నాం. ఆ నేచర్ మనమీదకు తిరగబడితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించాం. 55 రోజులు సినిమా షూట్ చేశాం. మేము పెట్టిన ఎఫర్త్స్ కు తగ్గ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇమాన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎమోషన్స్, లవ్, సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ అన్ని అంశాలు ఉంటాయి. ఈ నెల 19న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

మోహన్ రాజా మాట్లాడుతూ.. ''మా నాన్న మోహన్ గారి సమర్పణలో వచ్చిన ప్రతి తెలుగు సినిమా పెద్ద హిట్ అయింది. 14 సంవత్సరాల క్రితం నేను డైరెక్ట్ చేసిన హనుమాన్ జంక్షన్ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆ తరువాత మేము చెన్నైకి వెళ్ళిపోయినా ఎన్నో తెలుగు సినిమాను అక్కడ రీమేక్ చేసి మంచి పొజిషన్ లో ఉన్నాం. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్, సెన్సిబిలిటీస్ ఎలా ఉండాలో మొత్తం పనంతా.. తెలుగు సినిమాలకు వర్క్ చేసినప్పుడు నేర్చుకుందే.. మా తమ్ముడు జయం రవి నేను కలిసి చేసిన 'తని ఒరువన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రవి సౌత్ ఇండియన్ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ కు గురి చేస్తుంది. ఖచ్చితంగా ఎవరిని డిసప్పాయింట్ చేయదు'' అని చెప్పారు.

మోహన్ మాట్లాడుతూ.. ''ఇదొక డిఫరెంట్ సబ్జెక్టు. రవి చాలా బాగా నటించాడు. ఈ సబ్జెక్టును తెలుగులో కూడా చేయాలని భావించాం. తెలుగు నిర్మాత బాలకృష్ణ గారు రిలీజ్ చేస్తున్నారు. మేము ఏదైనా సిన్సియర్ గా చేస్తాం. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాళ్ళం. ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించి రవి కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జ్ఞానవేల్ రాజా, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, బాలకృష్ణ, ముకేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ