Advertisementt

అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కి ధీటుగా 'ఊపిరి'!

Sat 20th Feb 2016 12:15 PM
oopiri movie teaser,nagarjuna,vamsi paidipalli,pvp,karthi  అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కి ధీటుగా 'ఊపిరి'!
అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కి ధీటుగా 'ఊపిరి'!
Advertisement
Ads by CJ

నాగార్జున, కార్తీ, పి.వి.పి., వంశీ పైడిపల్లి ల 'ఊపిరి' టీజర్‌ ఫిబ్రవరి 20న - ఫిబ్రవరి 28న ఆడియో రిలీజ్‌ 

'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. ఈ చిత్రానికి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను ఈనెల 20న రిలీజ్‌ చేస్తున్నారు. ఆడియోను ఈనెల 28న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా మార్చిలో విడుదల చేయడానికి నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా..

నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ - ''మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత నాగార్జునగారు ఈ చిత్రంలో టోటల్‌గా డిఫరెంట్‌గా వుండే క్యారెక్టర్‌ చేస్తున్నారు. అలాగే 'ఆవారా' కార్తీ, తమన్నా జంట ఈ చిత్రంతో మరోసారి ఆడియన్స్‌ని అలరించబోతున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను ఫిబ్రవరి 20న రిలీజ్‌ చేస్తున్నాం. అలాగే ఫిబ్రవరి 28న ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం'' అన్నారు. 

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌ అయిన ఓ వ్యక్తి, ఎమోషనల్లీ ఛాలెంజ్డ్‌ అయిన మరో వ్యక్తి మధ్య ఏర్పడిన బంధం ప్రధాన కథాంశంగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రేక్షకులు, అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కి ధీటుగా ఈ చిత్రం రూపొందుతోంది'' అన్నారు. 

కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, తమన్నా భాటియా, సహజనటి జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, సిల్వ, డాన్స్‌: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ