Advertisementt

రెడీ ఫర్ రిలీజ్:వీరి వీరి గుమ్మడి పండు

Sun 21st Feb 2016 04:35 PM
veeri veeri gummadi pandu,february 26th release,rudhra  రెడీ ఫర్ రిలీజ్:వీరి వీరి గుమ్మడి పండు
రెడీ ఫర్ రిలీజ్:వీరి వీరి గుమ్మడి పండు
Advertisement
Ads by CJ

దుగ్గిన్‌ సమర్పణలో శివకృతి క్రియేషన్స్‌ బ్యానర్‌పై రుద్ర, వెన్నె, సంజయ్‌, బంగారం ప్రధానతారాగణంగా రూపొందిన చిత్రం 'వీరి వీరిగుమ్మడిపండు'. ఎం.వి.సాగర్‌ దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా..

చిత్ర దర్శకుడు ఎం.వి.సాగర్ మాట్లాడుతూ.. ''దాదాపు 63 మంది కొత్తవాళ్ళందరూ కలిసి పనిచేసిన చిత్రమిది. ఇటీవల ఔట్ పుట్ చూసుకున్నాం. చాలా సంతృప్తికరంగా వచ్చింది. ఇప్పటివరకూ వచ్చిన హారర్ చిత్రాల్లో ఒక బెంచ్ మార్క్ చిత్రంగా ''వీరి వీరి గుమ్మడి పండు'' నిలిచిపోతుంది. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారన్న నమ్మకంలో ఈనెల 26న మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మంచి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను'' అని అన్నారు. 

హీరో రుద్ర మాట్లాడుతూ.. ''సినిమా ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. సినిమాను అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను'' అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు 'వీరి వీరి గుమ్మడి పండు' చిత్రం ప్రేక్షకులకు ఒక విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని పేర్కొనడంతోపాటు.. ఈ సినిమా మంకీ విజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ