Advertisementt

'టెర్రర్' రిలీజ్ డేట్ ఖరారు!

Sun 21st Feb 2016 07:45 PM
terror movie release date,srikanth,sathish kasetty,shek masthan  'టెర్రర్' రిలీజ్ డేట్ ఖరారు!
'టెర్రర్' రిలీజ్ డేట్ ఖరారు!
Advertisement
Ads by CJ

శ్రీకాంత్, నికితా జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన సినిమా 'టెర్రర్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో..

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన హీరో శ్రీకాంత్ గారు. ఆయన నేను ఎప్పుడు కలిసిన సినిమాల గురించే మాట్లాడుకుంటాం. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా మాట్లాడింది టెర్రర్ సినిమా గురించే. ఆయన నటించిన ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలి. నిర్మాతకు మంచి లాభాలు రావాలి'' అని అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ''ఈ యూనిట్ తో వండర్ ఫుల్ జర్నీ చేశాను. స్క్రిప్ట్ నెరేషన్ విధానం నచ్చి సినిమా చేయడానికి రెడీ అయ్యాను. దర్శకుడు సతీష్ సినిమాను క్లీన్, నీట్ గా డైరెక్ట్ చేశారు. సాయికార్తీక్ అద్భుతమైన రీరికార్డింగ్ ఇచ్చాడు. కచ్చితంగా కమర్షియల్ గా సినిమా విజయం సాధిస్తుంది. నిర్మాత ఈ సినిమా సక్సెస్ తో మరిన్నిసినిమాలు చేయాలి '' అని అన్నారు.

నిర్మాత షేక్ మస్తాన్ మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీకి కొత్త. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. శ్రీకాంత్ సహా నటీనటులు, డైరెక్టర్ సతీష్ గారు మిగతా టెక్నిషియన్స్ సపోర్ట్ తో మంచి సినిమా తీయగలిగాం'' అని అన్నారు.

దర్శకుడు సతీష్ కాశెట్టి మాట్లాడుతూ.. ''ఈకాలంలో సినిమా చేయడమనేది పెద్ద విషయం కాదు. కానీ సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టమైన విషయం. నిర్మాతగారు ఇచ్చిన సపోర్ట్ తో సినిమా విడుదలకు రెడీ అయ్యింది. సినిమా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రవివర్మ, చిట్టి, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ ప్రసాద్, లక్ష్మీ భూపాల్, రవివర్మ సహా చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల్, ఎడిటర్: బసవ పైడి రెడ్డి, ఆర్ట్: మురళి కొండేటి, ఫైట్స్: రన్ జాషువా, మ్యూజిక్: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్: షేక్ జైన్ లాబ్దీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి అయినీడి, ప్రొడ్యూసర్: షేక్ మస్తాన్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సతీష్ కాసెట్టి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ