Advertisementt

'భద్రం (బికేర్‌ ఫుల్) బ్రదరూ' పాటలు విడుదల!

Tue 23rd Feb 2016 03:51 PM
badhram becareful brotheru,charan,sampoornesh babu,rajesh puli  'భద్రం (బికేర్‌ ఫుల్) బ్రదరూ' పాటలు విడుదల!
'భద్రం (బికేర్‌ ఫుల్) బ్రదరూ' పాటలు విడుదల!
Advertisement
Ads by CJ

చరణ్‌, రాజ్‌, హమీద ప్రధాన పాత్రల్లో మారుతి టీం వర్క్స్‌, సాయి వెంకట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్త నిర్మాణంలో ముళ్లపూడి రాంబాబు సమర్పణలో సంపూర్ణేష్‌బాబు ఒక కీక పాత్రలో బోణంకృష్ణ సతీష్‌, అడ్డగర్ల జగన్‌బాబు, ఉప్పూరీ బ్రహ్మాజి రాజేష్‌పులి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'భద్రం (బికేర్‌ ఫుల్) బ్రదరూ'. ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం హైదరాబాద్ లో జరిగింది. వి.వి.వినాయక్‌ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయగా, రాజ్‌తరుణ్‌ ఆడియో సీడీలను విడుదల చేసిన తొలి సీడీని మారుతి కి అందించారు.

వి.వినాయక్‌ మాట్లాడుతూ.. ''కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త దర్శకులను, కొత్త హీరోను తెలుగు చిత్రరంగానికి పరిచయం చేస్తున్న మారుతిని అభినందించాలి. అలాగే ఈ చిత్రం ద్వారా కోటయ్య గారి అబ్బాయి చరణ్‌ను ఈ సినిమాలో హీరోగా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. కోటయ్య గారు నాకు మంచి సన్నిహితులు. ఈ సినిమా ఘన విజయం సాధించాలి'' అని అన్నారు.

హీరో రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ.. ''ఈ మధ్యకాలంలో మారుతిగారు సక్సెస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, చరణ్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

మారుతి మాట్లాడుతూ.. ''ఒక మంచి టీమ్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాను. జె.బి.గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం ద్వారా మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అని చెప్పారు.

చిత్ర దర్శకుడు రాజేష్‌పులి మాట్లాడుతూ.. ''మారుతి టీమ్‌వర్క్స్‌ అనే సంస్థను నడిపించే బాధ్యతను నాకు అప్పగించినందుకు మారుతి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో సంపూర్ణేష్‌బాబు మూడు డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపిస్తాడు. ఇదొక వినోదాత్మక చిత్రం'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''మారుతిగారితో అసోసియేట్‌ అయి ఈ సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. ముందు ముందు కూడా ఆయనతో కలిసి సినిమాలు చేస్తాను. ఈ సినిమాతో భారీ లాభాలు ఆశించడం లేదు కాని, మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం'' అని అన్నారు

హీరో చరణ్‌ మాట్లాడుతూ..''అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న నన్ను మారుతిగారు హీరోను చేశారు. ప్రేక్షకు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అని అన్నారు.

సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ.. ''ఇంత వరకు మారుతి ఇంట్రడ్యూస్‌ చేసిన అందరిని ప్రేక్షకులు ఆదరించారు. ఇందులో నా చేత వైవిధ్యమైన డైలాగ్స్‌ను చెప్పించారు. వాటిని ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తారు'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సుమంత్‌ అశ్విన్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, కళ్యాణ్‌కృష్ణ, చిన్నికృష్ణ, శ్రీవసంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ