Advertisementt

'దృశ్యకావ్యం' రిలీజ్ కు రెడీ!

Wed 24th Feb 2016 03:20 PM
drusya kavyam trailer launch,ram karthik,ramakrishna reddy  'దృశ్యకావ్యం' రిలీజ్ కు రెడీ!
'దృశ్యకావ్యం' రిలీజ్ కు రెడీ!
Advertisement
Ads by CJ
రామ్ కార్తీక్, కాశ్మీర కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'దృశ్యకావ్యం'. ఈ సినిమా ట్రైలర్ ను హీరో నిఖిల్ మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..
నిఖిల్ మాట్లాడుతూ.. ''రామకృష్ణ గారి లాంటి ప్యాషన్ ఉన్న వ్యక్తులు ఇండస్ట్రీకు ఎంతో అవసరం. సినిమా ట్రైలర్ చాలా బావుంది. చూడడానికి కొత్తగా అనిపించింది. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. మార్చి 18న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.
దర్శకుడు రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. సినిమాలో ప్రతి సీన్ అందరికి నచ్చేలా జాగ్రత్తగా తీశాం. అందరు మనసుపెట్టి చేయడం వలనే దృశ్య కావ్యమయింది. ఇదొక ఎమోషనల్ లవ్ స్టొరీ. సరికొత్త కథాంశంతో, ఉత్కంట భరితంగా సాగుతుంది. కమలాఖర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మార్చి 18న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
సంగీత దర్శకుడు కమలాఖర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నాకు నాచిన విషయం ఒక్క ఫైట్, ఐటెం సాంగ్ లేకపోవడం. రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం కాదు. మంచి సినిమా తీశారు. 'ఏ కలవో' అనే పాట మంచి మెలోడియస్ సాంగ్ గా నిలిచిపోతుంది'' అని చెప్పారు.
రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ''ఇదొక లవ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దృశ్యకావ్యం వినడానికి ఎంత బావుందో.. చూడడానికి ఇంకా బావుంటుంది. కమలాఖర్ గారి మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అసెట్'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కాశ్మీర కులకర్ణి, రచ్చ రవి, మధునందన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సినిమాకు సంగీతం: కమలాఖర్, కెమెరామెన్: సంతోష్ శానమోని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లు శివనాగేంద్రరావు, ఎడిటర్: వి.నాగిరెడ్డి, దర్శకుడు: బెల్లం రామకృష్ణా రెడ్డి.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ