Advertisementt

కామెడీ ఎంటర్టైనర్ గా 'పోకిరిరాజా'!

Sun 28th Feb 2016 12:07 AM
pokiri raja movie,jeeva,hansika,ram prakash rayappa  కామెడీ ఎంటర్టైనర్ గా 'పోకిరిరాజా'!
కామెడీ ఎంటర్టైనర్ గా 'పోకిరిరాజా'!
Advertisement
Ads by CJ

2011లో వచ్చిన రంగం చిత్రంతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్టార్ హీరో జీవా. ఆ తర్వాత తెలుగులో వచ్చిన స్నేహితుడు, మాస్క్, చిరునవ్వుల జిరుజల్లు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఇదే క్రేజ్ తో పోకిరి రాజా పేరుతో మన ముందుకు రాబోతున్నాడు. ఫన్ ఆఫ్ విండ్ అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో జీవా నటించిన 25వ చిత్రం కావడంతో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. హన్సిక మోత్వానీ హీరోయిన్ గా జీవా సరసన నటించింది. రామ్ ప్రకాష్ రాయప్ప ఈ చిత్రానికి డైరెక్టర్. ప్రముఖ నటుడు సత్య రాజ్ తనయుడు సిబిరాజ్ ప్రతినాయకుడిగా నటించాడు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఉత్కంఠభరితంగా ఉంటాయి. కామెడీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

ఎస్ ఎస్ వి ఎస్ క్రియేషన్స్ సమర్పణలో, సాయి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, వి.హానీ ప్రమోధ్ మరియు శ్రీను సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు పోకిరి రాజ్ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడ్డప్పటికీ ఫ్యాన్సీ రేటు ఇచ్చి తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమ్మాన్ సంగీతమందించారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ''జీవా, హన్సికకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో జీవా, హన్సిక నటించిన చిత్రాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందుకే పోకిరి రాజా చిత్రాన్ని గ్రాండ్ గా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాం. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇమాన్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. అన్ని కమర్షియల్ హంగులతో నిర్మించిన ఈ చిత్ర తెలుగు హక్కులకు భారీ పోటీ ఏర్పడ్డప్పటికీ... ఫ్యాన్సీ ఆఫర్ తో మేం దక్కించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి... అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం'' అని అన్నారు.  

నటీనటులు - జీవా, హన్సిక మోత్వానీ, సిబిరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ - డి.ఇమ్మాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - డి.విజయ్ కుమార్, ప్రజెంటర్ - ఎస్ ఎస్ వి ఎస్ క్రియేషన్స్, బ్యానర్ - సాయి గీతా ఆర్ట్స్, నిర్మాతలు -  మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, వి.హానీ ప్రమోధ్, శ్రీను, డైరెక్టర్ - రాంప్రకాష్ రాయప్ప.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ