Advertisementt

చుట్టాలబ్బాయి రాజమండ్రి వెళ్తున్నాడు

Mon 29th Feb 2016 05:26 PM
hero aadi new movie chuttalabbayi,chuttalabbayi in rajahmundry,chuttalabbayi director veerabhadram,chuttalabbayi heroine namitha pramod  చుట్టాలబ్బాయి రాజమండ్రి వెళ్తున్నాడు
చుట్టాలబ్బాయి రాజమండ్రి వెళ్తున్నాడు
Advertisement
Ads by CJ

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చుట్టాలబ్బాయి. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ మార్చి 1 నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుంది. 
ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి మాట్లాడుతూ ఇటీవల మా చిత్రంలోని ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని బ్యాంకాక్‌లో శేఖర్‌ మాస్టర్‌ సారధ్యంలో 5 రోజులపాటు చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు మార్చి 1 నుంచి తాజా షెడ్యూల్‌ రాజమండ్రిలో ప్రారంభమవుతోంది. మార్చి 20 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది అన్నారు. 
దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ మార్చి 1 నుంచి జరిగే తాజా షెడ్యూల్‌ను రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరుగుతుంది. ఆది, నమిత ప్రమోద్‌ మరియు విలన్‌ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్‌లో ఒక పాటను, ఫైట్‌ను కూడా షూట్‌ చెయ్యబోతున్నాం. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ ఇచ్చాడు. ఈ సినిమా తప్పకుండా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది అన్నారు. 
లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ