ఆర్.ఎ. ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బి.ప్రశాంత్ నిర్మాతగా రమ్యశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం 'ఓ మల్లి'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..
రమ్య శ్రీ మాట్లాడుతూ.. ''కథ మీదున్న ఇష్టంతో రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఈరోజుల్లో సినిమా అంటే నాలుగు ఫైట్స్, ఆరు పాటలు, రెండు రొమాంటిక్ సీన్స్. కాని మా సినిమా అలా ఉండదు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంపిక చేసుకొని చాలా న్యాచురల్ గా సినిమా చేశాం. మార్చి 18న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సమాజంలో రిలేషన్స్ అనేవి మాయమైపోతున్నాయి. బంధాలకు పెద్ద పీట వేస్తూ ఈ సినిమా ఉంటుంది. ఓ అమాయకురాలి జీవితాన్నే సినిమాగా చేశాను. ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ప్రేమ, భార్య భర్తల అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించాం. ఇలాంటి సినిమా ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో రాలేదు. సెన్సార్ సమస్యలేమీ ఎదుర్కోలేదు కాని థియేటర్ల సమస్య మాత్రం బాగా ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా తరువాత మరో మూడు ప్రాజెక్ట్స్ లో నటించనున్నాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, బి.ఎస్.కృష్ణమూర్తి, ఎడిటింగ్: వి.నాగిరెడ్డి, సినిమాటోగ్రఫీ: కె.దత్తు, డాన్స్: డి.సురేష్, నిర్మాత: బి.ప్రశాంత్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బి.రమ్యశ్రీ.