Advertisementt

'కళ్యాణ వైభోగమే' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!

Wed 09th Mar 2016 11:14 AM
kalyana vaibhogame platinum disc function,nagashourya,nandini reddy,damodar prasad  'కళ్యాణ వైభోగమే' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!
'కళ్యాణ వైభోగమే' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!
Advertisement
Ads by CJ

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ 'అలా మొదలైంది', 'అంతకు ముందు ఆ తరువాత' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మించిన చిత్రం 'కళ్యాణ వైభోగమే'. నాగ శౌర్య , మాళవిక నాయర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్లాటినం డిస్క్ వేడుక మంగళవారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరిగింది. చిత్ర దర్శకనిర్మాతలు చిత్ర బృందానికి ప్లాటినం డిస్క్ లను అందించారు. ఈ సందర్భంగా..

నందిని రెడ్డి మాట్లాడుతూ.. ''ఈ వేడుక మా ఇంట్లో ఫంక్షన్ లా ఉంది. నేను దర్శకత్వం వహించిన 'అలా మొదలైంది' కంటే ఈ సినిమాకు మంచి అప్రిషియేషన్ వచ్చింది. చాలా మంది ఫోన్లు చేసి ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ సినిమాతో నాకు తృప్తి లభించింది. ఈ సినిమాను యూనిట్ అందరం ప్రేమించి, నమ్మి, ఇష్టంతో చేశాం. మనసుతో చేసిన సినిమా. కళ్యాన్ అధ్బుతమైన సంగీతాన్ని అందించాడు. నాకంటే కథను తనే ఎక్కువ నమ్మాడు. లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ అందరికి కనెక్ట్ అవుతున్నాయి. సినిమాకు పని చేసిన ప్రతి డిపార్ట్మెంట్ మంచి అవుట్ పుట్ కోసం కష్టపడ్డారు. సినిమా తీయడం ఒక ఎత్తయితే దాన్ని రిలీజ్ చేయడం ఒక ఎత్తు. దాము గారికి కథ నచ్చి సినిమాను నిర్మించారు. మొదటి నుండి నా కథలు ఆయన బాగా నమ్మారు. సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులను థాంక్స్'' అని చెప్పారు.

నాగశౌర్య మాట్లాడుతూ.. ''ఈ మధ్యకాలంలో నాకు పెద్దగా హిట్ సినిమా పడలేదు. అయినా కథను నమ్మి ఆ పాత్రకు నేను న్యాయం చేస్తానని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. లక్ష్మీ భూపాల్ గారు మంచి డైలాగ్స్ రాశారు. నేను ఈ సినిమాలో పెద్దగా నటించలేదు. నందిని గారు ఎలా నటించాలో చేసి చూపించేవారు. నేను ఆమెను ఫాలో అయిపోయేవాడ్ని. సినిమాలో నా నటనకు మంచి మార్క్స్ వచ్చాయంటే దానికి కారణం నందిని రెడ్డి గారే'' అని చెప్పారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''నందిని మంచి కథను అందించింది. కథను బాగా హ్యాండిల్ చేసింది. అలానే ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ కష్టపడి సినిమా చేశారు. అందరి కష్టానికి మంచి ప్రతిఫలం లభించింది'' అని చెప్పారు.

రాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించాను. నేను డైరెక్ట్ చేసేప్పుడు ఆర్టిస్టుల వర్క్ ఏం ఉండదు.. అంతా డైరెక్టర్ కష్టమే అనుకునేవాడ్ని. మొదటిసారి నేను నటుడిగా మారిన తరువాత యాక్టర్ల కష్టం ఎంత ఉంటుందో తెలిసొచ్చింది. లక్ష్మీ భూపాల్ మాటలు, లిరిక్స్ సినిమాకు పెద్ద ప్లస్'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మధురా శ్రీధర్ రెడ్డి, తాగుబోతు రమేష్, జెమిని సురేష్, కళ్యాన్ మాలిక్, లక్ష్మీ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ