Advertisementt

కత్రిన కరీన మధ్యలో కమల్ పనేంటి!

Thu 10th Mar 2016 08:34 PM
katrina karina madhyalo kamal hassan,sashank,ratna  కత్రిన కరీన మధ్యలో కమల్ పనేంటి!
కత్రిన కరీన మధ్యలో కమల్ పనేంటి!
Advertisement
Ads by CJ

శశాంక మౌళి, పావని జంటగా నవకళ పారి పతాకంపై రత్న దర్శకత్వంలో శ్రీను విజ్జగిరి, ప్రసాద్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'కత్రిన కరీన మధ్యలో కమల్ హాసన్'. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..

దర్శకుడు రత్న మాట్లాడుతూ.. ''ఇదొక ఫుల్ లెంగ్థ్ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ. మొత్తం 47 రోజులు షూటింగ్ చేశాం. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. అందరూ కొత్త వాళ్ళతో కలిసి చేసిన సినిమా. కామెడీ ఎమోషన్స్ ఉంటాయి. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తుంటారు..? నలుగురు అమ్మాయిలు ఒక దగ్గర కూర్చుంటే అబ్బాయిల గురించి ఏం మాట్లాడతారు..? అనే అంశాలతో సినిమా నడుస్తుంటుంది. సినిమాలో మొత్తం 5 పాటలుంటాయి. ఏప్రిల్ చివరి వారం లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

నిర్మాత విజ్జగిరి మాట్లాడుతూ.. ''డైరెక్టర్ రత్న చెప్పిన లైన్ నచ్చడంతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాం. అవుట్ పుట్ బాగా వచ్చింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.

శశాంక్ మాట్లాడుతూ.. ''కామెడీ నాకు ఇష్టమైన సబ్జెక్టు. ఈ సినిమాకు కథే హీరో. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు తగ్గట్లుగా ఉండే సినిమా. యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. డైలాగ్స్ సినిమాకు బలం. నాకు ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించే అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, సంగీతం: శ్రీకర్, ఫోటోగ్రఫీ: ప్రసాద్, శ్రావణ్ కుమార్, సహనిర్మాతలు: ఎస్.మల్లయ్య, బి.జగన్, నిర్మాతలు: శ్రీను విజ్జగిరి, ప్రసాద్ కుమార్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రత్న.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ