Advertisementt

'రొమాన్స్ విత్ ఫైనాన్స్' రిలీజ్ డేట్ ఖరారు!

Tue 15th Mar 2016 02:51 PM
romance with finance,sathish babu,raju kumpatla,janardhan  'రొమాన్స్ విత్ ఫైనాన్స్' రిలీజ్ డేట్ ఖరారు!
'రొమాన్స్ విత్ ఫైనాన్స్' రిలీజ్ డేట్ ఖరారు!
Advertisement
Ads by CJ

సతీష్ బాబు, మెరినా అబ్రహం జంటగా రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్ధన్ మందుముల నిర్మిస్తోన్న చిత్రం 'రొమాన్స్ విత్ ఫైనాన్స్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

దర్శకుడు రాజు కుంపట్ల మాట్లాడుతూ.. ''లవ్ స్టోరీను కథగా తీసుకొని సినిమా చిత్రీకరించాం. అందమైన ప్రేమ వెనుక దాగి ఉన్న రొమాన్స్, దానికి కప్పి ఉన్న ఫైనాన్సే ఈ సినిమా కథ. అందుకే రొమాన్స్ విత్ ఫైనాన్స్ అని టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం. సినిమాలో లవ్, రొమాన్స్ లతో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. హీరో, హీరోయిన్స్ కొత్త వాళ్లైనా.. చాలా చక్కగా నటించారు. బెస్ట్ లొకేషన్స్ లో సినిమా షూట్ చేశాం, జాన్ పొట్ల మంచి  మ్యూజిక్ అందించారు. మార్చి 18న సినిమా రిలీజ్ అవుతోంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నిర్మాత జనార్ధన్ మందుముల మాట్లాడుతూ.. ''సినిమా రంగం మాకు కొత్తైనా.. కథ నచ్చి సినిమా తీశాం. మంచి మ్యూజిక్ కుదిరింది. టీం అందరూ మంచి సపోర్ట్ అందించారు. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. ఈ నెల 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

సతీష్ బాబు మాట్లాడుతూ.. ''కొత్త వాళ్ళందరం కలిసి చేసిన సినిమా ఇది. క్వాలిటీగా సినిమాను తెరకెక్కించాం. అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ జాన్ పొట్ల మాట్లాడుతూ.. ''మ్యూజిక్ కు స్కోప్ ఉన్న సినిమా. పెద్ద సినిమాలకు పని చేసిన విధంగానే ఈ సినిమాకు కూడా వర్క్ చేశాం'' అని చెప్పారు. 

ఈ చిత్రానికి కెమెరా: మురళి, మ్యూజిక్: జాన్ పొట్ల, లిరిక్స్: సురేష్ గంగుల, బాలకృష్ణ, ఆర్ట్: సత్య శ్రీనివాస్, ఎడిటర్: క్రాంతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి మేకల, కో ప్రొడ్యూసర్: సుదర్శన్ సరికొండ, ప్రొడ్యూసర్: జనార్ధన్ మందుముల, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: రాజు కుంపట్ల.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ