500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకొని గత సంవత్సరం చైనాలో విడుదలై సంచలన విజయం సాధించిన 'ది మంకీ కింగ్' చిత్రం ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అదే పేరుతో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మార్చి 18న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్. ఈ సందర్భంగా..
నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. ''ది మంకీ కింగ్' ఫస్ట్ పార్ట్‌ను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి ఖర్చుకు వెనకాడకుండా ఎంతో క్వాలిటీగా డబ్బింగ్ చేయడం జరిగింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చుతుంది. 'బాహుబలి' చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగా ఎంజాయ్ దాన్ని మించి ఈ చిత్రంలోని గ్రాఫిక్స్‌నిగానీ, విజువల్ ఎఫెక్ట్స్‌ని గానీ ఎంజాయ్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చాలా చక్కని మాటలు రాశారు రాజశ్రీ సుధాకర్. అత్యంత భారీ బడ్జెట్‌తో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మా సంస్థ ద్వారా విడుదల చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మార్చి 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి సూపర్‌హిట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.
డోనీ ఎన్, చోయున్‌ఫాట్, అరోన్ క్వాక్, జో చెన్, పీటర్ హో ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: క్రిస్టఫర్ యంగ్, మాటలు: రాజశ్రీ సుధాకర్, నిర్మాత: సి.హెచ్.సతీష్‌కుమార్, దర్శకత్వం: చియాంగ్ పౌసాయ్.