Advertisementt

వేద ఎంటర్ప్రైజెస్ రెండో సినిమా ప్రారంభం!

Thu 17th Mar 2016 05:08 PM
veda enterprises movie opening,sreekar babu,varun daggubati  వేద ఎంటర్ప్రైజెస్ రెండో సినిమా ప్రారంభం!
వేద ఎంటర్ప్రైజెస్ రెండో సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

శ్రీనివాస రెడ్డి, ధీరేంద్ర, ప్రవీణ్, బిందు, కారుణ్య హీరో హీరోయిన్లుగా శ్రీకర్ బాబు దర్శకత్వంలో వేద ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్ నెంబర్ 2 సినిమా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. దగ్గుబాటి వరుణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రసన్న కుమార్ క్లాప్ కొట్టగా.. అశోక్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ''దర్శకుడు అనేవాడు నిర్మాత దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. దగ్గుబాటి వరుణ్, శ్రీకర్ బాబుతో ఇదివరకే 'ముసుగు' అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తన మీద నమ్మకంతో అప్పుడే రెండో సినిమాను కూడా నిర్మిస్తున్నాడు వరుణ్. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. సక్సెస్, ఫెయిల్యూర్ మన చేతిల్లో ఉండవు. ఎందరో యువకులు ప్యాషన్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. గంగోత్రి విశ్వనాథ్ గారు నేను చేసిన యాభై సినిమాలకు పని చేసి ఉంటారు. ఆయన కుమారుడు దర్శకునిగా మారి రూపొందించిన ఈ సినిమా సక్సెస్ కావాలి'' అని చెప్పారు. 

దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. ''వరుణ్ నా కజిన్. తను సినిమాలను నిర్మిస్తున్నాడని తెలిసి సర్ప్రైజ్ అయ్యాను. ఒక సినిమాను పూర్తి చేసి మరో సినిమాను నిర్మించబోతున్నాడు. మంచి దారిలో వెళితే సినిమాలు సక్సెస్ అవుతాయి. అలానే వరుణ్ కు ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి లాభాలు రావాలి'' అని చెప్పారు.

దర్శకుడు శ్రీకర్ బాబు మాట్లాడుతూ.. ''కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అలానే ఓ ప్రముఖ హీరోయిన్ ఈ సినిమాలో కనిపించబోతుంది. సినిమా మొదటి షెడ్యూల్ కాలేజ్ లో చిత్రీకరించి, రెండో షెడ్యూల్ వైజాగ్ లో షూట్ చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

నిర్మాత వరుణ్ దగ్గుబాటి మాట్లాడుతూ.. ''కామెడీ, హారర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇదివరకు శ్రీకర్, నేను కలిసి 'ముసుగు' అనే సినిమాను తెరకెక్కించాం. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. శ్రీకర్ మీద నమ్మకంతో మరో సినిమాను కూడా నిర్మిస్తున్నాను'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ అమోగ్ దేశపతి మాట్లాడుతూ.. ''ఇది నా రెండో సినిమా. ఇప్పటికే ఒక పాటను పూర్తి చేసేసాం. పాటలకు, సినిమాను మంచి పేరు రావాలి'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీనివాస రెడ్డి, ధీరేంద్ర, బిందు, కారుణ్య  పాల్గొని తమకు సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు.

ఈ చిత్రానికి లిరిక్స్, డైలాగ్స్: గంగోత్రి విశ్వనాథ్, మ్యూజిక్ డైరెక్టర్: అమోగ్ దేశపతి, నిర్మాత: దగ్గుబాటి వరుణ్, కథ-దర్శకత్వం: శ్రీకర్ బాబు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ