Advertisementt

రెగ్యులర్ హారర్ కు భిన్నంగా 'దృశ్యకావ్యం'!

Thu 17th Mar 2016 08:37 PM
drusyakavyam movie,ram karthik,rama krishnareddy  రెగ్యులర్ హారర్ కు భిన్నంగా 'దృశ్యకావ్యం'!
రెగ్యులర్ హారర్ కు భిన్నంగా 'దృశ్యకావ్యం'!
Advertisement
Ads by CJ

రామ్ కార్తీక్, కాశ్మీర కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'దృశ్యకావ్యం'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 

దర్శకుడు రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ''రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. రెగ్యులర్ హారర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. దృశ్యకావ్యం టైటిల్ లో రెండు షేడ్స్ కనిపిస్తాయి. ప్రతి ఇంట్లో జరిగే ఎమోషన్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ అవుతుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ'' అని చెప్పారు.

కమలాఖర్ మాట్లాడుతూ.. ''చక్కటి టైటిల్ తో సినిమాను రూపొందించారు. ఎంత ఖర్చు పెట్టి సినిమాను నిర్మించారో.. దానికి మించి ప్రమోషన్స్ కు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే పాటలకు మంచి ఆదరణ లభించింది. అలానే సినిమాను కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

రామ్ కార్తిక్ మాట్లాడుతూ.. ''రెండువందలకు పైగా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నాకు ఛాన్స్ రావడం అద్రుష్టంగా భావిస్తున్నాను'' అని చెప్పారు.

మధునందన్ మాట్లాడుతూ.. ''దర్శకుడు రామకృష్ణా రెడ్డి గారు హిట్స్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్యాషన్ తో   సినిమాలను తెరకెక్కిస్తున్నారు. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. డైరెక్టర్ గారు కథను బాగా హ్యాండిల్ చేశారు'' అని చెప్పారు.

ఈ సినిమాకు సంగీతం: కమలాఖర్, కెమెరామెన్: సంతోష్ శానమోని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లు శివనాగేంద్రరావు, ఎడిటర్: వి.నాగిరెడ్డి, దర్శకుడు: బెల్లం రామకృష్ణా రెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ