Advertisementt

పవన్ ప్రేరణతో హీరో అయ్యాను:సతీష్ బాబు

Thu 17th Mar 2016 09:12 PM
satish babu interview,romance with finance,raju kumpatla  పవన్ ప్రేరణతో హీరో అయ్యాను:సతీష్ బాబు
పవన్ ప్రేరణతో హీరో అయ్యాను:సతీష్ బాబు
Advertisement
Ads by CJ

సతీష్ బాబు, మెరినా అబ్రహం జంటగా రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్ధన్ మందుముల నిర్మిస్తోన్న చిత్రం 'రొమాన్స్ విత్ ఫైనాన్స్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో సతీష్ బాబు గురువారం విలేకర్లతో ముచ్చటించారు.

''చిన్నప్పటినుండి సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చాను. పవన్ కళ్యాన్ గారి ఇన్స్పిరేషన్ తో హీరో అయ్యాను. మాది ఈస్ట్ గోదావరి లోని కడియం. తరచూ అక్కడ సినిమా షూటింగ్స్ జరిగేవి. ఆ ఇన్ఫ్లుయెన్స్ నామీద బాగా ఉండేది. నేనే కథలు రాసుకొని రిహార్సల్స్ చేసేవాడిని. ఫేస్ బుక్ లో నా ఫోటోలు చూసిన ఒక వ్యక్తి ఆడిషన్ కు రమ్మని పిలిచారు. చాలా కష్టాలు పడ్డాను. ఆ తరువాత 'ప్రేమ ఒకమైకం' సినిమాలో నటించాను. హీరోగా 'రొమాన్స్ విత్ ఫైనాన్స్' సినిమాతో పరిచయం కానున్నాను.  అందమైన ప్రేమ వెనుక దాగి ఉన్న రొమాన్స్, దానికి కప్పి ఉన్న ఫైనాన్సే ఈ సినిమా కథ. జై అనే పాత్రలో కనిపిస్తాను. జై ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. వారి ఇద్దరి మధ్య కొన్ని అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా కథ. ఇందులో లవ్, రొమాన్స్ లతో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. మొత్తం ఐదు పాటలుంటాయి. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కు ఏ మాత్రం తగ్గకుండా జాన్ మ్యూజిక్ అందించాడు. రంపచోడవరం, వైజాగ్, కేరళ, రాజమండ్రీ తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించాం. మార్చి 18న రిలీజ్ అవుతోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను ప్రస్తుతం జానీ అనే కొత్త దర్శకునితో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమాలో నటిస్తున్నాను. ఒక షెడ్యూల్ పూర్తయింది'' అని చెప్పారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ