Advertisementt

దాసరి చేతులమీదుగా 'నాయకి' టీజర్!

Fri 18th Mar 2016 02:44 PM
nayaki movie teaser launch,trisha,girdhar,govi  దాసరి చేతులమీదుగా 'నాయకి' టీజర్!
దాసరి చేతులమీదుగా 'నాయకి' టీజర్!
Advertisement
Ads by CJ

త్రిష, గణేష్ వెంకటరామన్ ప్రధాన పాత్రల్లో రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'నాయకి'. గోవి దర్శకుడు. ఈ సినిమా టీజర్ ను దర్శకరత్న దాసరి నారాయణరావు గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా..

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''సినిమా టీజర్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. టీజర్ చూసిన తరువాత సినిమా బావుంటుందనే అభిప్రాయం ఏర్పడింది. గిరిధర్ జర్నలిస్ట్ గా, హీరోయిన్స్ కు పి.ఆర్.ఓ గా పనిచేసి సక్సెస్ అయ్యాడు. 'లక్ష్మి రావే మా ఇంటికి' సినిమాతో నిర్మాతగా మారాడు. ఈ సినిమా దానికంటే పెద్ద సక్సెస్ అవుతుంది. హీరోయిన్స్ ను మెయిన్ లీడ్ గా పెట్టుకొని నేను చాలా సినిమాలు చేశాను. ఒసేయ్ రాములమ్మ సినిమాతో విజయశాంతి చరిత్రను తిరగరాసింది. హీరోకు ఎంత పొటెన్షియాలిటీ ఉందో.. పెర్ఫార్మన్స్ తెలిసిన హీరోయిన్ కు కూడా అంతే పొటెన్షియాలిటీ ఉంటుంది. హీరోయిన్ కేవలం పాటలకు మాత్రమే కాకుండా.. మంచి హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం చేస్తోన్న గోవి కు నా అభినందనలు. త్రిష మంచి పెర్ఫార్మార్. ఈ సినిమాతో తను పెద్ద సక్సెస్ కావాలి. రఘు కుంచె మంచి మ్యూజిక్ ఇచ్చాడు. హారర్ సినిమాలకు నేపధ్య సంగీతం చాలా ముఖ్యమైనది. సాయి కార్తిక్ మా మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు'' అని చెప్పారు.

త్రిష మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం. అందరూ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేశారు. ఈ సినిమాలో ఒక పాట కూడా పాడాను. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

దర్శకుడు గోవి మాట్లాడుతూ.. ''గిరిధర్ గారు హారర్ కథలు వింటున్నారని తెలిసి కథ చెప్పడానికి వెళ్లాను. ఆయనకు నచ్చడంతో త్రిష గారికి కూడా కథ వినిపించాను. ఆమె విన్న ఐదు నిమిషాల్లోనే కథ ఓకే చేశారు. త్రిష అభిమానులకు ఈ సినిమా ఫీస్ట్ అవుతుంది. రెండు భాషల్లో సినిమా చేస్తున్నా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు గిరిధర్ గారు. అందరికి నచ్చే సినిమా అవుతుంది. సినిమాలో మొత్తం నాలుగు పాటలుంటాయి. ఇదొక రెట్రో హారర్ కామెడీ సినిమా'' అని చెప్పారు.

నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ.. ''ఇది మా బ్యానర్ లో రెండవ సినిమా. త్రిష గారి మేనేజర్ గా 7 నుండి 8 సంవత్సరాల వరకు పని చేసాను. అలాంటిది ఆవిడతో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా రెండవ సినిమా ఓ థ్రిల్లర్ జోనర్ లో చేయాలనుకున్నాను. కాని జోవి నాకు ఈ సినిమా కథ చెప్పగానే చాలా నచ్చింది. ఓ హారర్ స్టొరీ ఇది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. త్రిష గారు మూడు డైమెంషన్స్ ఉన్న పాత్రలో నటించారు. తన కెరీర్ ఈ సినిమా మెయిలు రాయిగా నిలిచిపోతుంది. త్రిష కు మంచి హిట్ సినిమా ఇస్తున్నానని కన్ఫర్మ్ గా చెప్పగలను. ప్రస్తుతం రీరికార్డింగ్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్ నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, జగదీశ్ చీకటి, గణేష్ వెంకటరామన్, సాయి కార్తిక్, రఘు కుంచె, సత్యం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కళ: కె.వి.రమణ, కూర్పు: గౌతం రాజు, పాటలు: భాస్కర్ భట్ల, సంగీతం: రఘు కుంచె, ఫోటోగ్రఫీ: జగదీశ్ చీకటి, నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: గోవి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ