Advertisementt

'దండుపాళ్యం2'కు ముహూర్తం ఫిక్స్ చేశారు!

Mon 21st Mar 2016 02:33 AM
dandupalyam2 movie,venkat,srinivas raju,ba raju  'దండుపాళ్యం2'కు ముహూర్తం ఫిక్స్ చేశారు!
'దండుపాళ్యం2'కు ముహూర్తం ఫిక్స్ చేశారు!
Advertisement
Ads by CJ

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'దండుపాళ్యం'. అప్పట్లో ఈ చిత్రం సెన్సేషనల్ విజయాన్ని సాధిచిందింది. ఇప్పుడు అదే టీంతో దర్శకుడు శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మాతగా ఈ చిత్రానికి సీక్వెల్ గా 'దండుపాళ్యం2' మార్చి 24న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శ్రీనివాస్ రాజు, నిర్మాత వెంకట్, బి.ఎ.రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. ''2013లో విడుదలైన 'దండుపాళ్యం' తెలుగులో పెద్ద సక్సెస్ సాధించింది.  మూడు సంవత్సరాలు తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ను రూపొందిస్తున్నాం. మార్చి 24షూటింగ్ ను ప్రారంభించి జూన్, జూలైలో పూర్తి చేసి ఆగస్ట్, సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ..''మూడేళ్ళ క్రితం విడుదలైన దండుపాళ్యం సక్సెస్ తర్వాత దానికి సీక్వెల్ ను మార్చి 24న ప్రారంభించనున్నాం. ఒకరు ఒక మంచి పని చేస్తే ఎలా ఎక్కువగా చేసి చూపిస్తామో, క్రైమ్ జరిగినప్పుడు కూడా అంతే. నిజాన్ని ఉన్నదున్నట్లు ఈ చిత్రంలో చూపించబోతున్నాను. మధ్యలో రెండు సినిమాలు చేయడం వల్ల సీక్వెల్ వెంటనే చేయలేకపోయాను. ఆ సినిమా విడుదల సమయంలోనే నేను సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశాను. ఆ సినిమా కోసం నేను వివరాలు సేకరిస్తున్నప్పుడు క్రైమ్ లో కూడా ఇంత పెద్ద స్పాన్ మూవీ ఉంటుందా అనిపించింది. అసలు పార్ట్ వెనుక ఉన్న కథను ఈ చిత్రంలోచూపిస్తాం. పోలీస్ డిపార్ట్ మెంట్, మీడియా, ప్రజలు ఇలా ముగ్గురి కోణంలో సినిమా ఉంటుంది. కాశీలో శివాలయంపై మసీదు, అయోధ్య రామమందిరంపై మసీదు ఇలా చరిత్రలో కొన్ని నిజ ఘటనలు మనం కాదనలేనివి జరిగాయి. అలాంటి బయోపిక్స్ ను ఆధారంగా చేసుకుని కూడా నేను సినిమాలు చేయబోతున్నాను. నిజానికి నేను ఈ స్టోరీ హేట్ చేస్తున్నాను. అయినప్పటికీ క్రైమ్ ను డైలూష్యన్ వేలో చూపిస్తున్నాను. సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉండదు'' అని అన్నారు. 

బి.ఎ.రాజు మాట్లాడుతూ.. ''2013లో విడుదలైన దండు పాళ్యం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది. తెలుగు, కన్నడలో ఈ సినిమా తెరకెక్కనుంది'' అని అన్నారు. 

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ