Advertisementt

నాగ్ ఆ సినిమాని చేయ‌ట్లేదా?

Sun 03rd Apr 2016 12:28 PM
nagarjuna,evado okadu story,dil raju,raviteja,  నాగ్ ఆ సినిమాని చేయ‌ట్లేదా?
నాగ్ ఆ సినిమాని చేయ‌ట్లేదా?
Advertisement
Ads by CJ

ఒక సినిమా సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో సినిమాకి లైన్ క్లియ‌ర్ చేసి పెట్టుకుంటుంటాడు నాగార్జున‌. మంచి క‌థ ఉంద‌ని తెలిస్తే అస‌లేమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వినేస్తాడు. వెంట‌నే త‌న నిర్ణ‌యాన్ని చెప్పేస్తాడు. అలాంటి నాగార్జున  ఓ క‌థ విష‌యంలో మాత్రం ఎటూ తేల్చ‌డం లేదు. క‌నీసం ఆ క‌థ‌ని విన్నాడో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. అస‌లు నాగ్ ఆ సినిమాని చేస్తాడా లేదా అని అభిమానులు కూడా ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు. ఆ క‌థ ఏదో కాదు.. దిల్ రాజు కాంపౌండ్‌లో త‌యారైన క‌థ. 

దిల్‌రాజు కాంపౌండ్‌కి చెందిన వేణుశ్రీరామ్ ఎవ‌డో ఒక‌డు పేరుతో ఓ క‌థ‌ని సిద్ధం చేశాడు. ఆ క‌థ‌ని రవితేజతో తీయాల‌నుకున్నారు. కానీ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో తేడాలు రావ‌డంతో ర‌వితేజ ఆ ప్రాజెక్టు చేయ‌న‌ని చెప్పేశాడు. దీంతో దిల్‌రాజు మ‌రో క‌థానాయ‌కుడిని వెదికి ప‌ట్టుకొనే ప‌నిలో ప‌డిపోయాడు. క‌థ నాగార్జున‌కి కూడా బాగానే ఉంటుంద‌ని భావించిన దిల్‌రాజు ఒక‌సారి క‌థ విన‌మ‌ని ఆయ‌న్ని కోరాడ‌ట‌. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న నాగార్జున మొద‌ట క‌థ విన‌డానికి సంసిధ్ధ‌త వ్య‌క్తం చేశాడు కానీ ఇప్ప‌టిదాకా వినింది లేదు. కొత్త సినిమాలు చేసే విష‌యంలోనూ అస‌లేమాత్రం ఆల‌స్యం  చేయ‌ని నాగార్జున ఆ క‌థ విష‌యంలో మాత్రం ఎందుకు నాన్చుతున్నాడో అర్థం కావ‌డం లేద‌ని టాలీవుడ్ జ‌నాలు మాట్లాడుకుంటున్నారు. కొద్దిమంద‌యితే నాగ్ క‌థ విన్నాడనీ, మ‌ళ్లీ రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనే దిల్‌రాజుకీ, నాగార్జున‌కీ డీల్ కుద‌ర్లేదనీ... అందుకే ఆ ప్రాజెక్టు ఇంకా ప‌ట్టాలెక్క‌లేద‌ని  చెప్పుకుంటున్నారు. మ‌రి అందులో వాస్త‌వ‌మెంత‌న్న‌ది తేలాల్సి వుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ