సుశీంద్రన్ దర్శకత్వంలో హీరోలు విశాల్, ఆర్య నిర్మించిన
'జీవా' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న జి.హరి
విష్ణు, శ్రీదివ్య జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'జీవా'. హీరోలు విశాల్, ఆర్య ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని విశాల్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.
విష్ణు, శ్రీదివ్య జంటగా నటించిన ఈ చిత్రానికి 'మిర్చి', 'శ్రీమంతుడు' ఫేమ్ మది ఫోటోగ్రఫీని అందించారు. సంగీతం: డి.ఇమాన్, ఎడిటింగ్: ఆంటోని, సమర్పణ: విశాల్, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుశీంద్రన్.