Advertisementt

​'అప్పుడలా ఇప్పుడిలా'కు మంచి రెస్పాన్స్ వస్తోంది!

Mon 04th Apr 2016 08:14 PM
appudala ippudila,surya teja,harshika poonacha  ​'అప్పుడలా ఇప్పుడిలా'కు మంచి రెస్పాన్స్ వస్తోంది!
​'అప్పుడలా ఇప్పుడిలా'కు మంచి రెస్పాన్స్ వస్తోంది!
Advertisement
Ads by CJ

తెలంగాణా, ఆంద్రప్ర‌దేశ్ రాష్ట్రాల్లో 'అప్పుడలా ఇప్పుడిలా' కి విజ‌యాన్నిఅందిస్తున్న‌ తెలుగు ప్రేక్ష‌కుల‌ని ధ‌న్య‌వాదాలు ప్ర‌దీప్ కుమార్ జంపా

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'అప్పుడలా ఇప్పుడిలా'. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్ కుమార్ జంపా నిర్మాత గా సిద్ద‌మైన చిత్రం ఏప్రిల్ 1న తెలంగాణా, ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుద‌ల‌య్యింది. ఈచిత్రం విడుద‌ల‌య్యిన మెద‌టిరోజు నుండి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంది. కేవ‌లం మౌత్ టాక్ తో మంచి రెవిన్యూ తెచ్చిపెడుతుంది. రోజురోజుకి ధియోట‌ర్స్ వ‌ద్ద ప్రేక్ష‌కుల సంద‌డి పెరుగుతుంది. మంచి చిత్రాలు ఎప్పుడూ తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు అన‌టానికి ఈ చిత్రం మ‌రో నిద‌ర్శ‌నం గా నిలిచింది. 

ఈ సందర్భంగా దర్శకుడు కె.ఆర్.విష్ణు మాట్లాడుతూ.. ''ఈ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి, విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి నా  థాంక్స్. సుమన్ గారి ద్వారా చాలా మంచి మెసెజ్ ని అందించాము. నరేష్, సూర్యతేజ ల మద్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుల్ని క్లాప్స్ కొట్టించేవిధంగా వున్నాయ‌ని అంద‌రూ అభినందిస్తున్నారు, హర్షికి గ్లామ‌ర్ సినిమాకి హైలెట్ గా నిలించింది. ఇలా ప్రతి ఒక ఆర్టిస్ట్ న‌ట‌న ఆకట్టుకున్నారు, టెక్నిషియన్ బాగా సపోర్ట్ చేశారు, అందరికీ థాంక్స్ రోజు రోజుకి ఈ చిత్రం క‌లెక్ష‌న్లు పెరుతున్నాయి'' అన్నారు.

నిర్మాత ప్రదీప్ కుమార్ జంపా మాట్లాడుతూ.. ''మా బ్యానర్ కి మంచి పేరు తెచ్చే చిత్రం గా నిలిచింది. డైరెక్టర్ విష్ణు ప్రతి సన్నివేశాన్ని బాగా డిజైన్ చేశారు కాబ‌ట్టే ఇప్ప‌డు ప్రేక్ష‌కులు ఇలా బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు. మ‌న‌సున్న ప్ర‌తి ఓక్క‌రూ ఈ చిత్రం చూడాలి.  బ్రహ్మారెడ్డిగారు మంచి కథను అందించారు.  ఏప్రిల్ 1న విడుద‌ల చేసిన మా చిత్రం కేవ‌లం మౌత్ టాక్ తో క‌లెక్ష‌న్లు పుంజుకుంటుంది. దీనికి తెలుగు ప్రేక్ష‌కులకి చిన్న చిత్రం పెద్ద చిత్రం అనే తేడా లేద‌ని మ‌రోక్క సారి నిరూపించారు. కేవ‌టం మంచి చిత్రాలు మాత్ర‌మే ఆద‌రిస్తారు. మా చిత్రాన్ని ఇంత‌లా ఆద‌రిస్తున్న ప్ర‌తి ఓక్క‌రికి మా హృదయపూర్వక ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము'' అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ