Advertisementt

అజహరుద్దీన్‌ కుమారుడు హీరోగా ఇద్దరికీ కొత్తేగా

Fri 08th Apr 2016 07:17 PM
cricketer azharuddin son abbas as hero,producer k.sureshbabu as director,abbas and k.sureshbabu movie iddarikee kothegaa,telugu movie iddarikee kothegaa  అజహరుద్దీన్‌ కుమారుడు హీరోగా ఇద్దరికీ కొత్తేగా
అజహరుద్దీన్‌ కుమారుడు హీరోగా ఇద్దరికీ కొత్తేగా
Advertisement
Ads by CJ
అంతర్జాతీయ క్రికెట్‌ క్రీడాకారుడు, మాజీ ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ కుమారుడు అబ్బాస్‌ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. శ్రీ శివపార్వతి కంబైన్స్‌ పతాకంపై నాకూ ఓ లవరుంది, దక్షిణ మధ్య భారత జట్టు వంటి విభిన్న చిత్రాలను నిర్మించిన కె.సురేష్‌బాబు కన్నడలో షేకింగ్‌ హ్యాండ్స్‌ పేరుతో ఓ మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీని నిర్మించారు. డిఫరెంట్‌ మూవీస్‌ని నిర్మిస్తూ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న కె.సురేష్‌బాబు ఇప్పుడు దర్శకుడుగా మారుతున్నారు. అజహరుద్దీన్‌ కుమారుడు అబ్బాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఇద్దరికీ కొత్తేగా పేరుతో ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందించబోతున్నారు కె.సురేష్‌బాబు. ఈ చిత్రంలో అబ్బాస్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం చాలా గ్రాండ్‌గా జరగనుందని కె.సురేష్‌బాబు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి మహమ్మద్‌ అజహరుద్దీన్‌తోపాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని, తన డైరెక్షన్‌లో రూపొందనున్న ఇద్దరికీ కొత్తేగా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని కె.సురేష్‌బాబు తెలిపారు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ