Advertisementt

సూర్య రిలీజ్ చేసిన 'పెన్సిల్' ట్రైలర్!

Sat 09th Apr 2016 06:33 PM
gv prakash,sridivya,pencil movie,mani nagraj  సూర్య రిలీజ్ చేసిన 'పెన్సిల్' ట్రైలర్!
సూర్య రిలీజ్ చేసిన 'పెన్సిల్' ట్రైలర్!
Advertisement
Ads by CJ

జి.వి.ప్రకాష్‌, శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్‌ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'పెన్సిల్‌'. ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై సక్సెస్‌ఫుల్‌ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఉగాది సందర్భంగా  సాయంత్రం 4.30 గంటలకు హీరో సూర్య విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

జి.వి.ప్రకాష్‌కుమార్‌, శ్రీదివ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో షరీఖ్‌ హాసన్‌, విటివి గణేష్‌, ఊర్వశి, టి.పి.గజేంద్రన్‌, అభిషేక్‌ శంకర్‌, ప్రియా మోష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: గోపీ అమర్‌నాథ్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: రాజీవన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: శ్రీమణి, నిర్మాణ నిర్వహణ: వడ్డీ రామానుజం, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణి నాగరాజ్‌

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ