Advertisementt

'లవ్ చెయ్యాలా వద్దా..?' రిలీజ్ డేట్ ఫిక్స్!

Sat 09th Apr 2016 09:15 PM
love cheyyala vadda,noushad,karthik,swetha varma  'లవ్ చెయ్యాలా వద్దా..?' రిలీజ్ డేట్ ఫిక్స్!
'లవ్ చెయ్యాలా వద్దా..?' రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

కార్తిక్, శ్వేతా వర్మ జంటగా జికె సినిమాస్ పతాకంపై నౌషాద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లవ్ చెయ్యాలా వద్దా..?. జి.వి.రమణ, సి.సంతోష్ కుమారి నిర్మాతలు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..

నిర్మాత రమణ మాట్లాడుతూ.. ''ఏప్రిల్ 15న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సుమారుగా 150 నుండి 200 థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతోందని'' అన్నారు.

''వైజాగ్, హైదరాబాద్, పాండిచ్చేరి ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ నిర్వహించాం. అవుట్ పుట్ బాగా వచ్చింది. టెక్నికల్ వాల్యూస్ తో ఉన్న సినిమా. మ్యూజికల్ గా కూడా సినిమాకు మంచి పేరొస్తుంది. రోమాన్స్, లవ్ వంటి అంశాలతో రూపొందించిన మంచి యూత్ ఫుల్ సినిమా ఇది. నిర్మాత కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని'' దర్శకుడు నౌషాద్ అన్నారు.

''ఈ సినిమా యూత్ కు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అవుతుంది. ఏప్రిల్ 15న సినిమా రిలీజ్ అవుతోంది. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా'' అని హీరో కార్తీక్ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: గౌతం డానీ, కెమెరా: ప్రవీణ్ కె, నిర్మాతలు: రమణ, సంతోషి కుమారి, దర్శకుడు: నౌషాద్

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ