Advertisementt

'వజ్రాలు కావాలా నాయనా' సినిమా ప్రారంభం!

Mon 11th Apr 2016 06:47 PM
vajralu kavala nayana,radhakrishna,kishore kumar  'వజ్రాలు కావాలా నాయనా' సినిమా ప్రారంభం!
'వజ్రాలు కావాలా నాయనా' సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

అనిల్, నేహ, నిఖిత ప్రధాన పాత్రల్లో శ్రీ పాద ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పి.రాధాకృష్ణ దర్శకత్వంలో కిషోర్ కుమార్ కోట నిర్మిస్తోన్న చిత్రం 'వజ్రాలు కావాలా నాయనా'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక సోమవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రథాని రామకృష్ణగౌడ్ క్లాప్ కొట్టగా.. కిషోర్ కుమార్ కోట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రథాని రామకృష్ణగౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

నిర్మాత కిషోర్ కుమార్ కోట మాట్లాడుతూ.. ''కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ బ్యానర్ ను స్థాపించాను. సింగిల్ షెడ్యూల్ లో నెల రోజుల పాటు సినిమా షూటింగ్ పూర్తి చేసి జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటివారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని'' తెలిపారు.

''ఇండియాలో ఫేమస్ అయిన ఒక పాయింట్ ను తీసుకొని సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. మెజారిటీ భాగం కామెడీ ఉండేలా చూసుకున్నాం. ఇప్పటివరకు విఎఫ్ఎక్స్ లో పని చేసేవాడిని. ఇది నా డెబ్యూ ఫిలిం'' అని దర్శకుడు రాధాకృష్ణ అన్నారు.

''తమకు సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' హీరో అనిల్, హీరోయిన్స్ నేహ, నిఖిత చెప్పారు.

ఈ చిత్రానికి కెమెరా: అమర్, మ్యూజిక్: జాన్, విజయ్ కురాకుల, ఆర్ట్ డైరెక్టర్: డేవిడ్, కో డైరెక్టర్: సూర్య, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.కృష్ణ, కథ: నిర్మాత: కిషోర్ కుమార్ కోట, మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పి.రాధాకృష్ణ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ