మధురిమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వంశీ సినిమా సరదాగా కాసేపులో నటించింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాలు చేసింది. మంచి అందతోపాటు, ఆ అందాన్ని ప్రదర్శించే తెలివి తేటలు కూడా ఈమెలో మెండుగానే వున్నాయి. కానీ ఎందుకో కలిసి రాలేదు. మంచి విజయం ఒక్కటీ పడలేదు. దీంతో చిన్న చిన్న పాత్రలకి పరిమితం కావల్సి వచ్చింది. షాడోలో మరీచిన్న పాత్ర చేసింది. అయితే కొంత కాలం తర్వాత ఆ తరహా పాత్రలు కూడా రాకపోవడంతో మరో స్టెప్ తీసుకొని ఐటెమ్ పాటలకి ఓకే చెప్పింది. దోచేయ్, కొత్తజంటలాంటి సినిమాల్లో ఐటెమ్ పాటలతో బాగానే అలరించింది ఆ తర్వాత మాత్రం మళ్లీ ఎవరూ ఆ తరహా అవకాశాలు ఇవ్వలేదు. దీంతో మధురిమ ఇతర భాషలపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. కన్నడ, హిందీల్లో నటిస్తూ అదృష్టాన్ని పరీక్షించుకొంటోంది. తాజాగా హిందీలో మధురిమ మరో బోల్డ్ స్టెప్ తీసుకుంది. సన్నీలియోన్ నటిస్తున్న అడల్ట్ కామెడీ మూవీ వన్ నైట్ స్టాండ్‌లో కీలక పాత్ర చేసింది. అయితే మధురిమ అనే పేరు వాడకుండా నైరా బెనర్జీగా కొత్త పేరు వేసుకొని అక్కడ ఆ సినిమా చేసింది. మరి ఇంత బోల్డ్ స్టెప్ తీసుకొన్న మధురిమకి ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి. సన్నీలియోన్ సినిమా అంటే ఆ ఎక్స్‌పోజర్ వేరే వుంటుంది. అందరి దృష్టిలోనూ పడొచ్చు. దీనివల్ల అవకాశాలు పెరుగుతాయి కదా అనే మధురిమ ఈ బోల్డ్ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తోంది.