Advertisementt

నాని హీరోగా త్రినాధరావు డైరెక్షన్ లో సినిమా!

Wed 27th Apr 2016 05:28 PM
bekkam venugopal,trinadharao nakkina,sekhar chandra  నాని హీరోగా త్రినాధరావు డైరెక్షన్ లో సినిమా!
నాని హీరోగా త్రినాధరావు డైరెక్షన్ లో సినిమా!
Advertisement
Ads by CJ

లక్కీ మీడియా సంస్థను ప్రారంభించి పది సంవత్సరాలు దాటింది. మంచి చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతోనే ఈ బ్యానర్ ను స్థాపించానని నిర్మాత బెక్కం వేణుగోపాల్ తన పుట్టినరోజు సందర్భంగా తెలిపారు. ఇదే రోజున ఆయనతో పాటు తన స్నేహితుడైన దర్శకుడు త్రినాధరావు నక్కిన కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా..

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''ట్రెండీ సినిమాలను తీయాలని.. కొత్త కథలతో గుర్తింపు పొందాలని త్రినాధరావు నక్కినతో కలిసి పని చేయడం మొదలుపెట్టాను. ప్రస్తుతం దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో నేను కో ప్రొడ్యూసర్ గా త్రినధరావు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాం. అలానే 'నేను నా బాయ్ ఫ్రెండ్స్' అనే సినిమా నిర్మాణంలో ఉంది. ఆ చిత్రానికి చోటా కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు'' అని చెప్పారు.

త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీకు వచ్చిన తరువాతే పుట్టినరోజులు చేసుకోవడం మొదలయ్యింది. ఇండస్ట్రీకు వచ్చిన తరువాత నాకు అవకాశాలు ఇచ్చింది వేణుగోపాల్ గారే. ఆయన పుట్టినరోజు, నా పుట్టినరోజు ఒకేరోజు కావడం ఆనందంగా ఉంది. ఇప్పటికి మా ఇద్దరి కాంబినేషన్ రెండు హిట్స్ ను అందుకున్నాం. మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఎక్కువ. ప్రస్తుతం ఒక సినిమా స్క్రిప్ట్ దశలో  ఉంది. ఆ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను. అలానే నాని హీరోగా దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాను.దానికి వేణుగోపాల్ గారు కో ప్రొడ్యూసర్'' అని చెప్పారు.

భాస్కర్ భాస్కర్ మాట్లాడుతూ.. ''నాకు ఇష్టమైన నిర్మాత, దర్శకుడు ఒకేరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 'మేము వయసుకు వచ్చాం' నుండి 'సినిమా చూపిస్తా మావ' వరకు గోపి గారి సినిమాలకు పని చేశాను. త్రినాధరావు గారు మంచి రచయిత.. డైలాగ్ రైటర్. నానితో ఆయన చేస్తోన్న సినిమా హిట్ కావాలి'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ, శేఖర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ