Advertisementt

అన్నయ్య సినిమాకు తమ్ముడు క్లాప్!

Fri 29th Apr 2016 10:59 PM
ntr,kalyan ram,puri jagannath,romance action entertainer  అన్నయ్య సినిమాకు తమ్ముడు క్లాప్!
అన్నయ్య సినిమాకు తమ్ముడు క్లాప్!
Advertisement
Ads by CJ

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తూ యన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ బేనర్‌పై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ ఏప్రిల్‌ 29 ఉదయం 9.50 నిమిషాలకు రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. 

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న డా. ఎన్‌.టి. రామారావు చిత్ర పటంపై చిత్రీకరించిన ముహూర్తం షాట్‌కు యంగ్‌టైగర్‌ క్లాప్‌ కొట్టగా, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. కొరటాల శివ ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. సాహసరత్న నందమూరి హరికృష్ణ, నందమూరి రామకృష్ణ పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. 

ఈ చిత్రం గురించి దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ''రొమాన్స్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ వుంటూనే సరికొత్త స్టైల్‌లో సాగే కమర్షియల్‌ ఫిల్మ్‌ ఇది. ఇందులో కొత్త కళ్యాణ్‌రామ్‌ని చూస్తారు. మే లోనే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసి ఓ షెడ్యూల్‌ స్పెయిన్‌లో చేస్తాం. హీరోగా కళ్యాణ్‌రామ్‌ ఇమేజ్‌ని మరింత పెంచే సినిమా అవుతుంది'' అన్నారు. 

హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ - ''పూరి జగన్నాథ్‌గారి దర్శకత్వంలో మా స్వంత బేనర్‌లో సినిమా చెయ్యడం చాలా ఆనందంగా వుంది. జగన్‌గారు కథ చెప్పినప్పట్నుంచీ ఎంతో ఎగ్జైట్‌ అవుతున్నాను. నా కెరీర్‌కి ఇది మరో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది'' అన్నారు. 

నందమూరి కళ్యాణ్‌రామ్‌ సరసన ఆదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తారు. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది. ఈ భారీ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: మహేష్‌, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ