ప్రముఖ తమిళ దర్శకుడు పాండిరాజ్ (పసంగ ఫేం) దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం కేడి బిల్లా-కిలాడి రంగా అదే పేరుతో తెలుగులో అనువాదమవుతుండడం తెలిసిందే. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రంలో విమల్, శివకార్తికేయన్ హీరోలు కాగా.. రెజీనా, బిందుమాధవి హీరోయిన్లు. ఈ సినిమా అన్ని కార్యక్రమాఉ పూర్తి చేసుకొని మే 13న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''2015 లో ఈ సినిమాను రీమేక్ చేయాలని ఎన్.వి.ప్రసాద్ గారు రైట్స్ తీసుకున్నారు కాని కుదరలేదు. సంవత్సరంన్నర ఆలస్యం అయినా... మంచి సినిమాను రిలీజ్ చేస్తున్నామనే సంతృప్తి ఉంది. చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఎక్కువైంది. త్వరలోనే ఆ సమస్య తొలగిపోతుంది. చిన్న సినిమాలకు కూడా ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది'' అని చెప్పారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ''తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడు.. ఆదరిస్తూనే ఉన్నారు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది'' అని చెప్పారు.
ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. ''కొంతమంది నిర్మాతలు అవగాహన లేకుండా సినిమాలను నిర్మించి చేతులు కాల్చుకుంటున్నారు. మొదట సినిమా నిర్మాణం గురించి తెలుసుకొని సినిమాలు చేయాలి. మిని థియేటర్స్ ను కొన్ని ఏరియాల్లో ఇప్పటికే నిర్మించడం మొదలుపెట్టాం'' అని చెప్పారు.
కృష్ణతేజ మాట్లాడుతూ.. ''సినిమాలో మంచి లవ్ ట్రాక్ తో పాటు తల్లితండ్రులను ఎలా గౌరవించాలనే విషయాన్ని చెప్పారు. మొత్తం ఐదు పాటలుంటాయి'' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్: శివ వై.ప్రసాద్, మ్యూజిక్ అండ్ సౌండ్ సూపర్ విజన్: శేషు కె.యం.ఆర్;, మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.సత్యనారాయణ, సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాత: తుమ్మపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పాండిరాజ్.