Advertisementt

అందరూ నవ్వించారు: శత్రుఘ్నసిన్హా

Thu 05th May 2016 10:11 PM
shatrughna sinha,manchu vishnu,raj tarun  అందరూ నవ్వించారు: శత్రుఘ్నసిన్హా
అందరూ నవ్వించారు: శత్రుఘ్నసిన్హా
Advertisement
Ads by CJ

మంచు విష్ణు, రాజ్ తరుణ్, సొనారిక, హేబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఈడో రకం ఆడో రకం'. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు, అనిల్ సుంకర నిర్మాత. ఏప్రిల్ 14న విడుదలయిన ఈ చిత్రం ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ప్రదర్శింపబడుతోంది. రీసెంట్ గా ఈ సినిమా చూసిన నటుడు, రాజకీయనాయకుడు శత్రుఘ్నసిన్హా విలేకర్లతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ''సినిమా చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. మోహన్ బాబును ఈ సినిమా చూపించమని రిక్వెస్ట్ చేశాను.  విష్ణు, రాజ్ తరుణ్ లు చాలా బాగా నటించారు. ఆర్టిస్ట్స్ అందరూ.. నవ్వించారు'' అని చెప్పారు.

దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''ప్రస్తుతం కామెడీ సినిమాల హవా నడుస్తోంది. ఆ కోవలో వచ్చిన మా సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. వైజాగ్, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో విజయవంతగా సినిమా ప్రదర్శింపబడుతోంది'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ