Advertisementt

4x4 మూవీ ప్రారంభం!

Mon 09th May 2016 08:13 PM
4x4 movie opening,prashanth,siva,priyanka  4x4 మూవీ ప్రారంభం!
4x4 మూవీ ప్రారంభం!
Advertisement
Ads by CJ

ప్ర‌శాంత్, ప్రియాంక హీరో హీరోయిన్లుగా.. చేజ‌ర్ల ఇంద్ర‌కుమార్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై శివ(అపురూప్‌) ద‌ర్శ‌క‌త్వంలో నూత‌న చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి త‌మ్మారెడ్డి భ‌రద్వాజ క్లాప్ కొట్ట‌గా, సి.కళ్యాన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా..

ద‌ర్శ‌కుడు శివ మాట్లాడుతూ.. ''నలుగురు స్నేహితుల జీవితంలో జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నాను. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం ద్వారా మా కుటుంబ సభ్యుడైన ప్ర‌శాంత్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. జూన్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అందరు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

ప్రశాంత్ మాట్లాడుతూ.. ''హీరోగా ఇది నా మొదటి సినిమా. కథ నచ్చి ఒప్పుకున్నాను. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. లవ్ స్టోరీతో పాటు అన్ని అంశాలు ఉంటాయి'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ నిహాల్ మాట్లాడుతూ.. ''సింగర్ అయిన నేను మొదటిసారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉంది. సినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను'' అని అన్నారు.  

ప్ర‌శాంత్, ప్రియాంక హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో తాగుబోతు ర‌మేష్‌, వేణు త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత ప‌ర్య‌వేక్ష‌ణః మ‌ణిశ‌ర్మ‌, సంగీతంః నిహాల్‌, కెమెరాః నాని చ‌మిడి శెట్టి, క‌థా స‌హ‌కారంః సాయి సునీల్‌, మాట‌లుః క్రాంతి స‌కినాల‌, ఫైట్స్ః దేవ‌రాజ్‌, నిర్మాణంః అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శివ‌(అపురూప్‌).

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ