మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ నిహారిక హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక మనసు పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో యంగ్ హీరో నాగశౌర్య నిహారికకు జోడీగా నటిస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రామరాజు దర్శకత్వంలో.. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నఈ మూవీ ఆడియోను మే 18 న శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. అయితే అసలు ఈ ఫంక్షన్ కు గెస్ట్ ఎవరు.. ఎవరి చేతుల మీదుగా ఆడియో లాంచ్ అవనుందని మెగా అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ఫంక్షన్‌కు నిహారిక సోదరుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, సాయి ధరమ్ తేజ్ లు చీఫ్ గెస్ట్‌లుగా రానున్నారు. తమ కుటుంబం నుంచి వస్తున్న తొలి హీరోయిన్ కావడం, అదే కాక ఒక్కగాని ఒక్క వారసురాలు కావడం, అన్నింటికి మించి నిహారిక కోసం ఒక మనసు మూవీ ఆడియో ఫంక్షన్‌కు మెగా హీరోలంతా వచ్చే అవకాశం ఉంది. నాగేంద్ర బాబు, వరుణ్ తేజ్‌లు ఎలాగూ నిహారిక సినిమా ఫంక్షన్‌కు హాజరవుతారు. సో.. చిరంజీవి, పవన్ కల్యాణ్ మినహా మిగిలిన మెగా ఫ్యామిలీ అంతా వేదికపై మెరిసే అవకాశం ఉంది.మెగా అభిమానులకు ఇంతకంటే పండగ ఏముంటుంంది ఇక.