విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం 'రాయుడు'. ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. బిగ్ సీడీని వి.వి.వినాయక్ విడుదల చేయగా.. ఆడియో సీడీలను రానా విడుదల చేసి తొలి సీడీని రకుల్ ప్రీత్ సింగ్ కు అందజేశారు. ఈ సందర్భంగా..
వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ''హరితో నాకు మంచి పరిచయం ఉంది. నిర్మాతగా తను ఈ సినిమాతో సక్సెస్ కావాలి. విశాల్ గత సినిమాల కంటే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ముత్తయ్యగారికి ఈ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
విశాల్ మాట్లాడుతూ.. ''నాకు, ముత్తయ్యకు వినాయక్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఒక హీరోకు మాస్ ఇమేజ్ తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కార్తి, శశికుమార్ లకు కెరీర్ లో మంచి గుర్తింపు తెచ్చే సినిమాలు చేశారు. ఈ సినిమాలో బస్తాలు మోసే క్యారెక్టర్ చేశాను. అనంతపూర్ యాసలో మాట్లాడతాను. వాడు వీడు తర్వాత నాకు బాగా సెట్ అయ్యే పాత్ర ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. ఇమాన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా మంచి, చెడులో నాకెప్పుడు తోడు ఉన్న వ్యక్తి రానా. చెన్నై వరదల సమయంలో రానా చేసిన సహాయం మర్చిపోలేనిది. నేను తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని నాన్నగారు పందెం కోడి సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయాను. త్వరలోనే టెంపర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాను'' అని చెప్పారు.
రానా మాట్లాడుతూ.. ''తెలుగబ్బాయి తమిళనాడులో పెద్ద హీరో అయ్యాడు. మంచి మనసున్న వ్యక్తి. తను నటించిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
ముత్తయ్య మాట్లాడుతూ.. ''నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. చెన్నై లో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా చూస్తుంటాను. వినాయక్, సుకుమార్, రాజమౌళి గారి సినిమాలు మిస్ కాకుండా చూస్తుంటాను'' అని చెప్పారు.
శ్రీదివ్య మాట్లాడుతూ.. ''విశాల్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన అనుకున్నది చేస్తారు. ఆయన చేసే పనులు ఆయనపై ఇంకా గౌరవం పెరిగేలా చేస్తాయి. వేల్ రాజ్ కు ప్రతి సీన్ ను చాలా అందంగా చూపించారు. ముత్తయ్య గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అందరికి నచ్చుతుంది. నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది'' అని చెప్పారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని, డి.వి.వి.దానయ్య , దిల్ రాజు, విక్రమ్ కె.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్, సంగీతం: డి.ఇమాన్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., ఫైట్స్: అనల్ అరసు, డాన్స్: బాబా భాస్కర్, సమర్పణ: విశాల్, దర్శకత్వం: ముత్తయ్య.