Advertisementt

చరణ్ రిలీజ్ చేసిన 'ఒక మనసు' ఆడియో!

Thu 19th May 2016 02:44 PM
oka manasu audio launch,niharika,ramaraju,naga shourya  చరణ్ రిలీజ్ చేసిన 'ఒక మనసు' ఆడియో!
చరణ్ రిలీజ్ చేసిన 'ఒక మనసు' ఆడియో!
Advertisement
Ads by CJ

నాగశౌర్య, నీహారిక జంటగా టీవీ9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామరాజు దర్శకత్వంలో మధురా శ్రీధర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'ఒక మనసు'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను నాగబాబు కి అందించారు. ఈ సందర్భంగా..

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''నీహారిక ఈ సబ్జెక్ట్ కు సూట్ అవుతుందని తనను సెలక్ట్ చేసుకున్న రామరాజు గారికి కృతజ్ఞతలు. యూట్యూబ్ సిరీస్ లో చాలా బాగా నటించింది. అచ్చమైన తెలుగబ్బాయిలా ఉంటాడు నాగశౌర్య. అలాంటి కోస్టార్ దొరకడం నీహారిక అదృష్టం. మ్యూజిక్ వినసొంపుగా ఉంది. నీహారిక కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

నాగబాబు మాట్లాడుతూ.. ''నీహారికకు మంచి కథ ఇచ్చిన రామరాజు గారికి థాంక్స్. అందరు హీరోలు ఉన్న ఫ్యామిలీ నుండి ఒక అమ్మాయి హీరోయిన్ గా రావడం ఎవరు జీర్ణించుకోలేరు. కాని చరణ్, అర్జున్, వరుణ్, తేజు ఇలా అందరు తనను సపోర్ట్ చేశారు. హీరోలు రాగా.. లేనిది హీరోయిన్ ఎందుకు రాకూడదని నీహారిక నన్ను ప్రశ్నించింది. ఆ ఒక్క మాటతో నా నోరు మూయించింది. తను సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''నీహారిక నువ్వు ఆలోచించే సినిమాల్లో దిగి ఉంటావ్. నువ్వు సంతోషంగా ఉండాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్. ఇక మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ప్రతి సారి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. దానికి కారణం పవన్ కళ్యాన్ గారు కాదు. అసలు ఆయనకు సంబంధమే లేదు. నేను మాట్లాడకుండా వెళ్ళిపోవడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను కొంతమంది అభిమానులు మాత్రమే.. ఆడియో ఫంక్షన్స్ కి వచ్చే కొందరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గ్రూప్ గా ఫాం అయ్యి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచి ఫంక్షన్ ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ వలనే నేను పవర్ స్టార్ గురించి మాట్లాడకుండా టాపిక్ ఎవైడ్ చేశాను. ఫంక్షన్ కు వచ్చే ఆర్టిస్ట్స్ తమ పెర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలనుకుంటారు. కాని కొంచెం భయం ఉంటుంది. అలాంటి సమయంలో పవర్ స్టార్ అని అరవడం వలన మెకానికల్ గా ఏదో మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఒక పెద్ద దర్శకుడు వంద రోజులు కష్టపడి సినిమా తీసి ఆడియో ఫంక్షన్ పెట్టుకొని తన సినిమా గురించి మాట్లాడదామనుకుంటే.. అప్పుడు కూడా పవర్ స్టార్ అని అరిచి ఆ సినిమా గురించి చెప్పనివ్వకుండా చేస్తున్నారు. అభిమానులుగా మీరు వారికి గౌరవం ఇవ్వాలి. మెగా హీరోలు లేని బయట ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవడం చాలా తప్పు బ్రదర్. అవతలి హీరోలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. దాని వలన మనం పెరుగుతామే.. కాని తగ్గం. 'బ్రదర్ మా వాళ్ళ ఫంక్షన్ లో మీ వాళ్ళ గోలెంటని' ఒకరు నన్ను అడిగారు. 'అబ్బా అనుకున్నాను'.. అది మన తప్పే కదా.. ఇంకో విషయం 'నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా అన్నయ్యే అని కొన్ని వందల సార్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాంటి చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనను  మరొక మాట మాట్లాడనివ్వకుండా.. పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను బ్రదర్. మనకి ప్లాట్ ఫాం క్రియేట్ చేసింది అలంటి మెగాస్టార్ గారిని కూడా మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. మీరు ఎంత అరిచిన నేను పవర్ స్టార్ గురించి చెప్పను. కొన్ని వందల సార్లు ఆయన గురించి నేను చెప్పాను. నా సినిమాల్లో కూడా చెప్పాను. కొత్తగా చెప్పాలా..? చాలా ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ గురించి అడిగితే నేను చెప్పలేదు. కాంట్రవర్సీ ఎందుకు అని ఎవైడ్ చేశాను కానీ.. ఎవైడ్ చేయడం వలన ఇంత కాంట్రవర్సీ అవుతుందనుకోలేదు. ఈ సమయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడు హిట్స్ కొట్టాడు కదా.. అందుకే పవర్ స్టార్ గురించి మాట్లాడట్లేదని అపార్ధం చేసుకుంటారు. నేను పవర్ స్టార్ గురించి మాట్లాడకుండా వెళ్ళిపోయినప్పుడు మీరు బాధపడి ఉంటారు. కాని నేను మిమ్మల్ని హర్ట్ చేసినదానికంటే వంద రెట్లు మీరెక్కువ హార్ట్ చేశారు మమ్మల్ని. దయచేసి మీ అల్లరిని ఒక లిమిట్ లో పెట్టుకోండి. పబ్లిక్ లో మనం తగ్గద్దు. నన్ను ఇష్టపడే ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి సోషల్ మీడియాలో వెర్బల్ వార్ ఆపండి.. చాలా చీప్ గా ఉంది. మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. నా ఒక్కడికే ఇబ్బంది వస్తే పర్లేదు.. నా వలన నా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా చిరంజీవి గారికి మచ్చ రావడం నాకిష్టం లేదు'' అని చెప్పారు. 

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''మెగా ఫ్యామిలీలో ఇదొక ముఖ్యమైన రోజు. మన అమ్మాయిలను హీరోయిన్స్ గా ఇంట్రడ్యూస్ చేయం. అందుకే తెలుగు హీరోయిన్స్ అరుదుగా ఉంటారు. నార్త్ నుండి హీరోయిన్స్ ను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాని నాగబాబు ధైర్యం చేసి తన కూతురుని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. తను హీరోయిన్ అవుతుందని ఒకసారి కాదని ఒకసారి ఇలా మాటల్లోనే ఒకసారి మీడియాలో తనను చూశాను. అప్పటికే బన్నీ 'సరైనోడు' సినిమా మొదలయ్యింది. లేదంటే నీహారికనే హీరోయిన్ గా సెలక్ట్ చేసుకునేవాళ్ళం'' అని చెప్పారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''సునీల్ కశ్యప్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. నా 'లోఫర్' సినిమాకు మ్యూజిక్ తనే చేశాడు. రామరాజు లాంటి మంచి డైరెక్టర్ చేతుల మీదుగా నీహారిక పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. చిన్నప్పుడు డాక్టర్ అవుతాను.. ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని చెప్పేది. కాని తెలుగు ఇండస్ట్రీలో చేరింది. తనకు ఈ ప్లేస్ కరెక్ట్ కాదని మొదట్లో అనిపించింది. కాని తన కాన్ఫిడెన్స్ గైన్ చేసుకుంది. నాగశౌర్య ఫైనెస్ట్ యాక్టర్. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

దర్శకుడు రామరాజు మాట్లాడుతూ.. ''ఈ సినిమా అనుభవం కంటే మంచి అనుభూతి. అనుభవాలను పంచుకోగలము గానీ.. అనుభూతిని పంచుకోలేము. ప్రొడక్షన్ బాయ్ నుండి అందరి కష్టమే ఈ సినిమా. మల్లెలతీరం తరువాత సినిమాలు చేయకూడదనుకున్నాను. నాతో సినిమా చేయించడానికి కారణం చంద్రమౌళి గారు. అరకులో ఈ సినిమా షూటింగ్ జరినప్పుడు ఎమోషనల్ క్రైసిస్ వచ్చింది. సినిమా మానేసి వెళ్లిపోదామనుకున్నా.. ఆ సమయంలో నా వెన్నంటే ఉండి నేను సినిమా పూర్తి చేసేలా చేశాడు బ్రహ్మారెడ్డి. శౌర్య, నీహారిక, నేను కలిసి తయారుచేసుకున్న సినిమా. మేము కాకుండా ఫిజికల్ గా కష్టపడి సినిమా చేసింది శ్రీధర్ గారే.నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. సునీల్ కశ్యప్ నేను అనుకున్న మ్యూజిక్ ఇచ్చాడు. నీహారిక మరో సావిత్రి లా మిగలాలనేదే నా కోరిక'' అని చెప్పారు.  

నీహారిక మాట్లాడుతూ.. ''నా కుటుంబ సభ్యులు నాకిచ్చే సపోర్ట్ నా స్త్రెంగ్థ్. చిరంజీవి డాడీ ముళ్ళ మీద నడిచి మాకు తార్ రోడ్ వేశారని నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆ రోడ్ మీద నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాను. ఈ సినిమా విషయానికొస్తే.. సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నా మొదటి సినిమాకు రామరాజు గారి లాంటి డైరెక్టర్ దొరకడం నా అద్రుష్టం. ఆయన నాకు స్టొరీ నేరేట్ చేసినప్పుడే నాకు తెగ నచ్చేసింది. శౌర్యతో కలిసి వర్క్ చేయడం కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. అమ్మ ప్రేమ ఎంత స్వచ్చంగా ఉంటుందో... మా సినిమా కూడా అంతే స్వచ్చంగా ఉంటుంది'' అని చెప్పారు.

నాగశౌర్య మాట్లాడుతూ.. ''సినిమా ఎప్పుడు మొదలయిందో.. ఎప్పడు పూర్తయిందో.. కూడా తెలియదు. చాలా తొందరగా షూటింగ్ పూర్తయిపోయింది. ఈ క్రెడిట్ అంతా రామరాజు గారికే చెందుతుంది. ఈ సినిమా సాంగ్స్ నా ప్రాణం. రామజోగయ్యశాస్త్రి, భాస్కర్ భట్ల గారు మంచి సాహిత్యం అందించారు'' అని చెప్పారు.

మధురా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ''తెలుగులో వచ్చిన మంచి ప్రేమకథలు తమిళ దర్శకులే చేస్తున్నారు. అలాంటి సమయంలో రామరాజు గారు తెలుగులో మంచి ప్రేమ కథను తీశారు. ఒక మనసు ప్యూర్ లవ్ స్టోరీ'' అని చెప్పారు. 

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ''నీహారిక, నాగశౌర్య టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

సునీల్ కశ్యప్ మాట్లాడుతూ..''నన్ను ఈ సినిమాకు మ్యూజిక్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న రామరాజు గారికి థాంక్స్. ఆడియో, సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ.. ''ఈ సినిమా చేస్తున్నారని తెలిసి సంతోషపడ్డాను. రామరాజు గారు నేరేషన్ చెప్పినప్పుడు కథలో లీనమైపోయాను. అంత గొప్పగా నేరేషన్ ఇచ్చారు. ఈ సినిమాలో మొత్తం 5 వెర్షన్ సాంగ్స్ రాశాను. సునీల్ కశ్యప్ అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాలో ఉన్న మొత్తం 9 పాటలు ప్రేక్షకులకు నచ్చుతాయి. ఆడియో, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

రవిప్రకాష్ మాట్లాడుతూ.. ''సినిమాను పూర్తి స్థాయిలో ప్రేమించే వ్యక్తి రామరాజు. తెలుగులో వైవిధ్యబరితమైన చిత్ర నిర్మాణం రామరాజు గారి వలన సాధ్యమవుతుందని మేము నమ్ముతున్నాం.  ఆయనతో కలిసి టీవీ9 పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనడంలో సందేహం కలగడం లేదు. నీహారిక తెలుగు ఇంటర్నెట్ వరల్డ్ ను రూల్ చేస్తోంది. నాగశౌర్య విజయపరంపర గురించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ