మహేష్ బ్రహ్మోత్సంలో మొత్తం ముగ్గురు కథానాయికలు. కానీ మహేష్ మాత్రం సమంత, కాజల్‌లతోనే కలిసి సినిమాని ప్రమోట్ చేశాడు. ఇంకా స్టార్ హీరోయిన్ అనిపించుకోని ప్రణీతని మాత్రం పక్కనపెట్టేశాడు. అన్నట్టు సినిమాలోనూ ఆమె రోల్ అలాగే ఉంటుంది. ఏదో రెండు డైలాగులకీ, రెండు పాటలకీ మాత్రమే ఆమెని వాడుకొన్నారు. అందుకేనేమో... ప్రమోషన్ వ్యవహారాల్లోనూ ఆమెకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆ మాటకొస్తే ఆడియో ఫంక్షన్‌లో కూడా ప్రణీత గురించి పెద్దగా ఎవ్వరూ ప్రస్తావించింది లేదు. కానీ ఆమె మాత్రం తనకి తాను అందంగా ముస్తాబై, ఆడియో ఫంక్షన్‌కి హాజరై, ఒకటికి రెండుసార్లు తన డ్రెస్సు చూసుకొని ఓ మహారాణిలా ఉన్నానని మురిసిపోయింది. బ్రహ్మోత్సవం ఆడియోకి హాజరయ్యా... అంటూ ఆన్‌లైన్‌లో తనని తాను కాస్త ప్రమోట్ చేసుకొందంతే. అయితే యూనిట్ మాత్రం సినిమా విడుదలయ్యాక ప్రణీతని రంగంలోకి దించింది. ఓ పత్రికకి ఆమెతో ఇంటర్వ్యూ ఇప్పించింది. కనిపించింది రెండు మూడు సన్నివేశాల్లోనే అయినా ప్రణీత మాత్రం సినిమాలో తన పాత్ర గురించి గొప్పగానే చెప్పుకొచ్చింది. తనకి నటించే అవకాశమొచ్చిందని, నటిగా మంచి ఆత్మసంతృప్తిని మిగిల్చిందని చెప్పుకొచ్చింది. ఆమె మాటల్ని చూసి ఎంతైనా ప్రణీత అల్ప సంతోషి అంటూ కామెంట్లు చేస్తున్నారు సినీ జనాలు. ప్రణీత ఇలాంటి పాత్రల్లో ఇంకెన్ని రోజులు కనిపిస్తుందో!