జంటిల్‌మెన్ ట్రైలర్‌లో అడ్వెంచర్ టైమ్ స్టార్ట్... అంటూ నాని తనలోని ఓ కొత్త యాంగిల్‌ని చూపిస్తున్నాడు. సంభాషణేమో కానీ... ఈ కథని చూచాయగా అర్థం చేసుకొంటుంటే నిజంగానే నాని అడ్వెంచర్ చేసినట్టే అనిపిస్తోంది. ఆయనలో ఇప్పటిదాకా హీరో యాంగిల్‌నే చూశాం, కానీ ఈ సినిమాలో మోహనకృష్ణ ఇంద్రగంటి నానిలోని విలన్‌ని కూడా చూపించినట్టు తెలుస్తోంది. అందుకే నాని కూడా నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్‌లో దర్శకుడు నాలో హీరోతోపాటు, విలన్‌ని కూడా చూశాడని చెప్పుకొచ్చాడు. హీరో నాని సూపర్‌హిట్టయ్యాడు. మరి విలన్‌గా ఆయన ఎలా పెర్‌ఫార్మ్ చేశాడో చూడాలి. నాని రెండు షేడ్స్‌లో అదరగొట్టాడన్న విషయం మాత్రం ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది. హీరోయిన్లు సురభి, నివేదా థామస్ అందంతో మాయ చేసినట్టే ఉన్నారు. ఎప్పుడూ సున్నితమైన కథలతో సినిమాలు తీసే మోహనకృష్ణ ఈసారి క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ని ఎంచుకొని జెంటిల్‌మెన్ చేశాడు. బందిపోటుతో ఆయనకి పరాభవం ఎదురైంది. అందుకే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న లక్ష్యంతో జెంటిల్‌మన్ తీశాడు. క్రైమ్ థ్రిల్లర్‌తో కూడిన ఈ సబ్జెక్ట్‌లో నానిని చూస్తుంటే కొత్తగానే ఉంది. మణిశర్మ మ్యూజిక్ సినిమాకి ఎస్సెట్‌లా అనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. ఈ టీమ్‌లో నానికి తప్ప అందరికీ అర్జంటుగా హిట్టు కావాలి. అందుకే దర్శకుడు, సంగీత దర్శకుడు మరింత శ్రద్ధతో ఈ సినిమా చేసినట్టు అర్థమవుతోంది.