Advertisementt

సంపూర్నేష్ కు మెగాహీరో సపోర్ట్!

Tue 24th May 2016 03:07 PM
kobbari matta movie,sampoornesh,roopak,sai rajesh  సంపూర్నేష్ కు మెగాహీరో సపోర్ట్!
సంపూర్నేష్ కు మెగాహీరో సపోర్ట్!
Advertisement
Ads by CJ

సంపూర్నేష్ బాబు, గాయత్రి, గీతాంజలి ప్రధాన పాత్రల్లో రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో  గుడ్ సినిమా గ్రూప్ మరియు అమృత ప్రొడక్షన్స్, సంజనా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'కొబ్బరిమట్ట'. సాయి రాజేష్ నీలం, ఆది కుంభగిరి నిర్మాతలు. ఈ సినిమా టీజర్ ను సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా..

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ''ప్రపంచంలోనే అతి పెద్ద టీజర్ ను నాతో లాంచ్ చేయించారు. సంపు అంటే నాకు చాలా ఇష్టం. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు అనే బ్రాండ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా టీం అందరికి ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.

మారుతి మాట్లాడుతూ.. ''సంపూ రియల్ పెర్ఫార్మార్. ఏదో ఆకతాయితనంగా తను ఇండస్ట్రీలోకి రాలేదు. తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. నిర్మాత తనకున్న పరిధిలో ఆడియన్స్ కు ఈ సినిమా రీచ్ అయ్యే విధంగా తగిన ప్రయత్నాలు చేస్తున్నాడు. వారి ప్రయత్నం సక్సెస్ కావాలి'' అని చెప్పారు.  

సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ.. ''హృదయకాలేయం సినిమా ట్రైలర్ ను చూసి మారుతి గారు ఆఫీస్ కు పిలిపించి మాట్లాడారు. ఆయన నాకు సెంటిమెంట్ గా మారిపోయారు. 'కొబ్బరిమట్ట' టీజర్ ను సాయి ధరమ్ తేజ్ లాంచ్ చేస్తుంటే.. మెగాస్టార్ చిరంజీవి గారే లాంచ్ చేసారనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు రూపక్ రొనాల్డ్ సన్ మాట్లాడుతూ.. ''పెదరాయుడు గెటప్ లో సంపూ చెప్పే డైలాగ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. రెండు, మూడు పేజీలు ఉండే ఆ డైలాగ్ చెప్పడానికి తను చాలా టేక్స్ తీసుకుంటాడని అనుకున్నాను. కాని అవలీలగా చెప్పేసాడు'' అని చెప్పారు.

నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. ''హృదయకాలేయం తర్వాత సంపూతో సినిమా చేయాలనుకున్నాను. ఈ చిత్రం ద్వారా రూపక్ రొనాల్డ్ సన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. అంత అధ్బుతంగా వచ్చింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు. 

ఈ చిత్రానికి సంగీతం: కామ్రాన్, స్టంట్స్: స్టంట్ జాషువా, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: స్టివెన్ శంకర్, ప్రొడ్యూసర్స్: సాయి రాజేష్ నీలం, ఆది కుంభగిరి, దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ