Advertisementt

రెడీ ఫర్ రిలీజ్: 'వినోదం100%'!

Thu 26th May 2016 12:39 PM
dasari narayanarao,vinodam 100%,jai sriram,ashwini  రెడీ ఫర్ రిలీజ్: 'వినోదం100%'!
రెడీ ఫర్ రిలీజ్: 'వినోదం100%'!
Advertisement
Ads by CJ

విజయ్ భరత్, అశ్విని, సత్యం రాజేష్, సంపూర్నేష్ బాబు, పృథ్వి ప్రధాన పాత్రల్లో శ్రీమతి పొట్నూరు సరోజమ్మ ఆశీస్సులతో ఎస్ ఎస్ సెల్యులాయిడ్స్ బ్యానర్ లో పొట్నూరు చక్రధరుడు సమర్పించు చిత్రం 'వినోదం 100%'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు మే 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి గతిలేని పరిస్థితి కనిపిస్తోంది. నా తరఫున ఈ సినిమాను ప్రోత్సహించాలని నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈ సినిమాలో పృథ్వి, సత్యం రాజేష్, సంపూర్నేష్ బాబు ఇలా 100% ఎంటర్టైన్ చేసే ఆర్టిస్టులే ఉన్నారు. ఈ చిత్ర దర్శకుడు నా 'ధ్వని ప్రతిధ్వని' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమాను బాగా డైరెక్ట్ చేసే ఉంటాడు. రామదాసు ఈ సినిమాను రిలీజ్ చేసే బాధ్యత తన మీద వేసుకున్నాడు. మే 27న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. టీం అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

రామదాసు మాట్లాడుతూ.. ''ఈ సినిమాను నేను చూశాను. బాగా వచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్ అవుతారు'' అని చెప్పారు.

నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''ఈ సినిమా కొంత పార్ట్ ఫారెన్ లో కూడా చిత్రీకరించాం. మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు జై శ్రీరాం మాట్లాడుతూ.. ''చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రామదాసు గారు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. ఆర్టిస్ట్స్ అందరూ చక్కగా కోపరేట్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి ధన్యవాదాలు'' అని చెప్పారు.

అశ్విని మాట్లాడుతూ.. ''అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఇది. డెఫినిట్ గా సక్సెస్ అవుతుంది. అమెరికాలో కూడా కొన్ని చోట్ల ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు'' అని చెప్పారు

ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: మల్లిఖార్జున్, మాటలు: అంజన్, రచన: జయ కుమార్, పాటలు: చిర్రా వూరి విజయ కుమార్, కృష్ణ చిన్ని, చంద్ర కాటుబోయిన, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాత: పొట్నూరు శ్రీనివాసరావు, స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జై శ్రీరామ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ