శ్రీ వెంకటేశ్వర సినీ పిక్చర్స్ పతాకంపై నాగేష్ సి.హెచ్ నిర్మాతగా బేబీ దివ్య ప్రియ సమర్పణలో ఎ.వి.ఫణీశ్వర్ (తుఫాన్) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పక్కాప్లాన్'. సుభాష్ , నాగేష్ ,భవానీ, యువరాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ చేతుల మీదులగా టీజర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సంధర్భంగా..
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ...''హర్రర్ చిత్రాలు ప్రస్తుతం బాగా ఆడుతున్నాయి. ఈ తరుణంలో 'పక్కాప్లాన్' లాంటి మంచి టైటిల్ తో హర్రర్ చిత్రాన్ని నిర్మించడం మంచి ప్లాన్. టైటిల్ లాగే, టీజర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఓ కొత్త టీమ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... ''టైటిల్, టీజర్ రెండూ కూడా చాలా క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి. ప్రేమ్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది. టీజర్ లోనే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలిసిపోతుంది'' అని చెప్పారు.
సంగీత దర్శకుడు ప్రేమ్ ఎల్.ఎమ్ మాట్లాడుతూ... ''నేను గతంలో రాంగోపాల్ వర్మగారి చిత్రాలకు పనిచేశాను. ఓ రోజు ఈ చిత్ర దర్శకుడు కలిసి సినిమా స్టోరీ నేరేట్ చేశారు. చాలా రోజుల తర్వాత ఏకంగా సినిమా తీసుకొని వచ్చి, ఈ సినిమాకు మీ నేపథ్య సంగీతంతో ప్రాణం పోయాలన్నారు. నేపథ్య సంగీతానికి స్కోప్ ఉన్న సినిమా కావడంతో ఎంతో ఇష్టపడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను'' అని చెప్పారు.
దర్శకుడు ఎ.వి.ఫణీశ్వర్ (తుఫాన్)... ''ఓ కొత్త పాయింట్ తో హర్రర్ , సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా నిర్మాత పక్కాప్లాన్, మా టీమ్ అందరి హార్డ్ వర్క్ తో ఈ సినిమా అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా చేయగలిగాము. ఇందులో నటించిన వారందరూ కొత్త వారైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్న నటీనటుల్లా నటించారు. ప్రేమ్ సంగీతం సినిమాకు ఆయువు పట్టు'' అని చెప్పారు.
నిర్మాత, హీరో నాగేష్ సి.హెచ్ మాట్లాడుతూ... ''మా దర్శకుడు తుఫాన్ గారు అనుకున్నది అనుకున్నట్టుగా తీసారు. ఇలాంటి టీమ్ తో వర్క్ చేయడం చాలా సౌకర్యంగా ఉంది. త్వరలో సెన్సార్ పూర్తి చేసి సినిమాను విడుదల చేయడానికి పక్కా ప్లాన్ జరుగుతోంది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: ప్రేమ్ ఎల్.ఎమ్, కెమేరాః లక్కీ, ఎడిటర్ః సర్తాజ్, నిర్మాతః నాగేష్ సి.హెచ్, కథ-మాటలు- స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: ఏ.వి.ఫణీశ్వర్( తుఫాన్)